మార్చి8 కి టాకీ పూర్తి చేసుకోనున్న'భరత్ అనే నేను' ?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన తాజా షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
మార్చి 8కి పూర్తయ్యే ఈ షెడ్యూల్‌తో ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక మిగిలివున్న పాటను మార్చి రెండో వారంలో మహేష్, కైరా అద్వానీపై చిత్రీకరించనున్నారు. అనంతరం నిర్మాణానంతర పనులను చేపట్టనున్నారు.
'శ్రీమంతుడు' సినిమా తర్వాత మహేష్, కొరటాల కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments