భరత్ అనే నేను సక్సెస్ మీట్ ప్లేస్ మారింది...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, కొరటాల శివ దర్శకత్వంలోరూపొందిన చిత్రం `భరత్ అనే నేను`. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం 125 కోట్ల గ్రాస్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. శ్రీమంతుడు తర్వాత మహేశ్, కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా అంచనాలకు ధీటుగా సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఏప్రిల్ 27న తిరుపతిలో నిర్వహించాలని నిర్మాత భావించారు.
కాగా తాజా సమాచారం ప్రకారం సక్సెస్ మీట్ డేట్, ప్లేస్ మారేలా ఉందట. డేట్ విషయమై క్లారిటీ రాలేదు కానీ.. ప్లేస్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కియరా అద్వాని హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలైంది. మహేశ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సినిమా కలెక్షన్స్‌ను సాధించింది. తదుపరి మహేశ్.. సుకుమార్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com