'భరత్ అనే నేను' లో రొమాంటిక్ ట్రాక్ కీల‌క‌మ‌ట‌

  • IndiaGlitz, [Wednesday,April 18 2018]

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియరా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డి.వి.వి.దాన‌య్య నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌క‌ర్త‌. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌ధానంగా ఈ సినిమా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినా.. ఇందులో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా తెరపై చూపించబోతున్నార‌ట‌ కొరటాల.

ముఖ్య‌మంత్రి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపించాలనుకున్న కొరటాల.. దానిని హీరోయిన్ వైపు నుంచి తెరకెక్కించి.. ఆ రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా చక్కగా రూపొందించారని సమాచారం. ఈ ట్రాక్‌లో హీరోయిన్ పాత్రే కీలకమని, కియరా పాత్రని చాలా చక్కగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఓ విధంగా మహేశ్.. సి.ఎం.గద్దె దిగడానికి కియరా పాత్రే కీలకమని చెబుతున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ప్ర‌తి స‌న్నివేశ‌మూ సినిమాలో కీల‌క‌మ‌ని స‌మాచారం. మ‌రి..ఈ ప్రేమాయణం చూడాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే.

More News

లాగిన్ మీడియా ప్రొడక్షన్ నెం 2 చిత్ర ప్రారంభోత్సవం..

లాగిన్ మీడియా శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో బాలరాజు గౌడ్ సమర్పించు ప్రొడక్షన్ నెంబర్.2

నా పేరు సూర్య సాంగ్ కి సినిమాటోగ్ర‌ఫి అందించిన‌ హ‌లీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌ జోసెఫ్ లబిసి

ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మరియు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ ల‌బిసి

'నీ ప్రేమ కోసం' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

జొన్న ప‌ర‌మేష్‌, రాధ బంగారు జంట‌గా ఉలి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ట‌ర్ గోవింద్ బోగోజు స‌మ‌ర్ప‌ణ‌లో

ఆదిత్య మ్యూజిక్ కి 'అమ్మ‌మ్మ‌గారిల్లు' ఆడియో హ‌క్కులు

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా రాజేష్ మ‌రియు కె.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమా కోసం త‌మ‌న్ క‌స‌ర‌త్తులు

యువ సంగీత ద‌ర్శ‌కుడు తమన్‌కు 2018 బాగానే కలిసొస్తుంద‌నే చెప్పాలి.