'భరత్ అనే నేను' లో రొమాంటిక్ ట్రాక్ కీలకమట
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియరా అద్వాణీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ప్రధానంగా ఈ సినిమా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినా.. ఇందులో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా తెరపై చూపించబోతున్నారట కొరటాల.
ముఖ్యమంత్రి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపించాలనుకున్న కొరటాల.. దానిని హీరోయిన్ వైపు నుంచి తెరకెక్కించి.. ఆ రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా చక్కగా రూపొందించారని సమాచారం. ఈ ట్రాక్‌లో హీరోయిన్ పాత్రే కీలకమని, కియరా పాత్రని చాలా చక్కగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఓ విధంగా మహేశ్.. సి.ఎం.గద్దె దిగడానికి కియరా పాత్రే కీలకమని చెబుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రతి సన్నివేశమూ సినిమాలో కీలకమని సమాచారం. మరి..ఈ ప్రేమాయణం చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com