రికార్డు స్థాయిలో 'భరత్ అనే నేను'
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, హ్యాట్రిక్ హిట్ చిత్రాల డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భరత్ అనే నేను'. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వాని కథానాయికగా నటించింది. టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరగడంతో నిర్మాణ వర్గాలు మంచి జోష్లో ఉన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధపడ్డారు.
తాజా సమాచారం ప్రకారం.. యు.ఎస్.లో 19వ తేదీ రాత్రి 2000 ప్రీమియర్ షోలను ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక ఆస్ట్రేలియాలో కూడా ఇంతవరకూ ఏ తెలుగు సినిమా విడుదల కానంత భారీ స్థాయిలో.. దాదాపు 45 ప్రదేశాల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ హంగామా వేరేగా చెప్పనక్కరలేదు. ఈ ప్రీమియర్ షోల హడావిడి చూస్తూ ఉంటే.. తొలిరోజే భారీ ఎత్తున ఓపెనింగ్స్ రాబట్టాలనే ఆలోచనలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com