'భరత్ అనే నేను' కి అదే హైలైట్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమంతుడు`తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ సినిమాని తెరకెక్కించిన కొరటాల శివ డైరెక్షన్‌లోనే.. ప్రస్తుతం భరత్ అనే నేను` సినిమాను మహేష్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా.. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకోనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇంటర్వెల్ బాంగ్‌ను చాలా చక్కగా డిజైన్ చేసారంట కొరటాల. అక్కడ మహేష్ చెప్పే డైలాగ్స్.. అందర్నీ ఆలోచింపజేసే విధంగానూ, ఆసక్తిని రేకెత్తించే విధంగానూ ఉంటాయని తెలిసింది. అంతేగాకుండా, సినిమాకే హైలైట్‌గా ఆ ఎపిసోడ్ ఉంటుందని తెలిసింది. అలాగే సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా మహేష్ అభినయం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments