'భరత్ అనే నేను' ... షూటింగ్ అప్ డేట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను`. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల క్లైమాక్స్ కి సంబంధించిన పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ నెల 10 వరకు రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. మిగిలిన నాలుగు పాటలలో...పూణేలో ఒక పాటను, హైదరాబాద్లో రెండు పాటలను ఈ నెలాఖరు కల్లా చిత్రీకరించనున్నట్టు సమాచారం.
ఇక మిగిలిన పాటను, కీలక సన్నివేశాలను షూట్ చేయడం కోసం విదేశాలకు వెళ్లనుంది చిత్ర బృందం. అక్కడ 16 రోజుల పాటు సాగే చిత్రీకరణతో సినిమాకి సంబంధించి షూటింగ్ పార్ట్ ముగుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, ఆమని, సితార, రమాప్రభ, పోసాని, దేవదాస్ కనకాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం శ్రీమంతుడు` ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com