'భరత్ అనే నేను' ..ఆ సీన్స్ ఎంతో కీలకం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో మహేష్‌కు జంటగా కియారా అద్వానీ నటించారు. తాజాగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మహేష్ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అసెంబ్లీ సెట్‌ను వేయించారు.
అంతేగాకుండా.. ఈ అసెంబ్లీ సన్నివేశాలను చక్కగా తీర్చిదిద్దారట దర్శకుడు. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ సీన్స్ సినిమాకి చాలా కీలకమనీ.. ఇవే సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ఈ సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటూనే.. ఆలోచింపచేసేవిగా కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఘట్టం సినిమాని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుందని చెబుతున్నారు. అయితే.. పొలిటికల్ డ్రామాతో పాటు.. మహేష్, కియారా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ నెల 20వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments