'భ‌ర‌త్ అను నేను' ఫ‌స్ట్ లుక్ డేట్‌...

  • IndiaGlitz, [Tuesday,January 16 2018]

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

శ్రీ‌మంతుడు త‌రువాత మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ రూపొందిస్తున్న ఆ చిత్రమే భ‌ర‌త్ అనే నేను. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌బోతున్నారు. గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ అధికార‌కంగా ప్ర‌క‌టించింది.