ఏప్రిల్ 7న భరత్ బహిరంగ సభ
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్ అనే నేను'.
ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. భరత్ అనే నేను టైటిల్ సాంగ్, 'ఐ డోంట్ నో' పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ 'భరత్ బహిరంగ సభ' పేరుతో ఏప్రిల్ 7 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో వైభంగా జరగనుంది.
సూపర్‌స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్, ఎస్.తిరునవుక్కరసు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com