'భరత్ అనే నేను' ఆడియో రిలీజ్ ఎప్పుడంటే..

  • IndiaGlitz, [Sunday,March 11 2018]

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'భరత్ అనే నేను'. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని కథానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుదిద‌శ‌కు చేరుకుంది.బ్యాలెన్స్ ఉన్న‌ పాటలు, అలాగే మహేష్‌పై చిత్రీకరించవలసిన కొన్ని సన్నివేశాల కోసం త్వరలోనే చిత్ర బృందం ఇంగ్లాండ్‌కు పయనమవనుంది.

ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్రసాద్ స్వర సార‌థ్యంలో రూపొందిన ఆడియోని ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ మేరకు నిర్మాత దానయ్య, మహేష్‌ను సంప్రదించగా.. మహేష్ కూడా ఈ డేట్‌కు ఆడియో ఫంక్షన్ నిర్వహించమని చెప్పినట్టు చిత్ర బృందాలు వెల్లడించాయి.

త్వరలోనే ఈ వేడుక ఎక్క‌డ జ‌రుగనుందో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏప్రిల్ 20న విడుదల కానున్న ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, ఆమ‌ని, సితార త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

More News

మ‌రింత ఫిట్‌నెస్‌తో ప్ర‌భాస్‌

'బాహుబలి' సిరీస్‌తో జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నారాయ‌న‌.

మార్చ్ 23న విడుదల కానున్న 'నీది నాది ఒకే కథ'

శ్రీ విష్ణు హీరో గా నటించిన 'నీది నాది ఒకే కథ' చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు.

మ‌రోసారి ల‌వ‌ర్ బాయ్‌గా అఖిల్‌?

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా రెండు సినిమాల్లో నటించినా.. అవి కెరీర్ పరంగా ఏ మాత్రం సాయపడలేక పోయాయి. తొలి చిత్రం 'అఖిల్' కెరీర్లోనే డిజాస్టర్‌గా మిగలగా.. రెండో చిత్రం 'హలో'కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర  అనుకున్నంత సందడి చేయలేకపోయింది.

రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు?

కొంత కాలం స్తబ్దుగా ఉన్న కెరీర్‌ను.. సెకండ్ ఇన్నింగ్స్‌లో భిన్నమైన పాత్రలతో పరుగులు పెట్టిస్తున్నారు జగపతి బాబు. ఓ పక్క తండ్రి పాత్రలు పోషిస్తూనే.. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రతినాయకుడి పాత్రల్లో హీరోకి ధీటుగా నటించి మెప్పిస్తున్నారు ఈ సీనియ‌ర్ క‌థానాయ‌కుడు.

మెగా బ్ర‌ద‌ర్స్ విల‌న్‌తో ర‌వితేజ?

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు 'దూకుడు', 'బాద్‌షా' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించి టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు దర్శకుడు శ్రీను వైట్ల. ఆ తర్వాత కాలం క‌లిసిరాక‌.. హ్యాట్రిక్ పరాజయాలతో బాగా వెనకపడిపోయారు.