'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించిన చిత్రం 'భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను అభిమానులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు.
1) గుంటూరు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు కోట శేషగిరి ఆధ్వర్యంలో 'భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలు పల్లవి థియేటర్ లో ఘనంగా నిర్వహించారు . ముఖ్య అతిధి చికాగో డాక్టర్ వాసిరెడ్డి శ్రీనాథ్ కేక్ కట్ చేయగా థియేటర్ మేనేజర్ రామిరెడ్డి కి మెమెంటో అందజేశారు. థియేటర్ సిబ్బందికి వస్త్రాలను పంపిణి చేసారు.
ఈ సందర్భంగా సీనియర్ అభిమాని బాపనయ్య సారధ్యంలో ప్రత్యేక తెరపై సూపర్ స్టార్ కృష్ణ మహేష్ పాటలను ప్రదర్శించారు. ముఖ్య అతిధులు డాక్టర్ శ్రీనాథ్ , పిఆర్ఓ బాలాజీ శర్మ లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమాని జాలాది రవి , యస్ కే బాజీ , కొండబోయిన శ్రీను , గుండా హరి , మాదాల నరేంద్ర , నెల్లూరు గాంధీ , అమీద్ , డేవిడ్ , రాజేంద్ర , ముక్కంటి తదితరు పాల్గొన్నారు
2) విజయవాడ కపర్తి థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు చంటి ఆధ్వర్యంలో ' భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కేక్ కట్ చేసి థియేటర్ నిర్వాహకులు శ్రీను బాబు కి 50 రోజుల షీల్డ్ అందజేశారు , బాణాసంచా కాల్చారు . ఈ కార్యక్రమంలో సాకేత్ వీరమాచనేని , ఇబ్రహీం , మహేష్ , సూర్య , శివ తదితర అభిమానులు పాల్గొన్నారు .
3) వైజాగ్ లో సిటీ వైడ్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ డైమండ్ పార్క్ ఆధ్వర్యంలో సంఘం శరత్ థియేటర్ లో ' భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు థియేటర్ మేనేజర్ లు సుధాకర్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి లు కేక్ కట్ చేయగా వారికీ 50 రోజుల షీల్డ్ అందజేశారు.
ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ నటించిన పాటలను అందించారు . ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బి అప్పల రాజిరెడ్డి , అధ్యక్షుడు వి సుబ్రహ్మణ్యం , గౌరవ కార్యదర్శి మద్ది రాజశేఖర్ రెడ్డి , బలివాడ ప్రవీణ్ కుమార్ , కార్యదర్శి జీరు రమేష్ రెడ్డి , మహేష్ , శ్రీకాంత్ , మహేష్ బాబు , జనచైతన్య శ్రీనివాస్ , కేబుల్ శీను , రామ్ సుభాష్ , కాకి శ్రీనివాస్ రెడ్డి , ఉదయ్ , సంతోష్ , కృష్ణ , రమేష్ , రవితేజ తదితర అభిమానులు పాల్గొన్నారు.
4) అమలాపురం శేఖర్ దియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నర్సింహా మూర్తి ఆధ్వర్యంలో 'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు, థియేటర్ సిబ్బందికి బిర్యానీ ప్యాకెట్లు పంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న జాషువాన్త్ అనే అయిదు సంవత్సరాల బాలుడికి లక్షరూపాయలు ఆర్థికసహాయం చేసారు . ఈ కార్యక్రమంలో వెంకటేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు
5) తాడేపల్లిగూడెం లోని శేషమహల్ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు , మున్సిపల్ కౌన్సిలర్ సింగం సుబ్బారావు , కార్యదర్శి సింగం త్రిమూర్తులు ఆధ్వర్యంలో ' భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా థియేటర్ అధినేత చిట్యాల రఘు కేక్ కట్ చేయగా మెమెంటో అందజేసి బాణాసంచా కాల్చారు. థియేటర్ సిబ్బందికి హాట్ బాక్స్ లను అందించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా లోటస్ విద్య సంస్థల అధినేత బొలిశెట్టి రాజేష్ , జిల్లా డిస్టిబ్యూటర్ జబర్దస్త్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .యల్లమల్లి రాజేష్ , సతీష్ , షఫీ ,శేఖర్ , డేవిడ్ తదితర అభిమానులు పాల్గొన్నారు
6) హైదరాబాద్ సంధ్య దియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అభిమాని రాజశేఖర్ రెడ్డి , థియేటర్ మేనేజర్ మధుసూదన్ లు కేక్ కట్ చేయగా, మేనేజర్ కి మెమెంటో అందజేశారు, ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ నటించిన చిత్రాల్లోని పాటలను ప్రదర్శించారు .
ఈ కార్యక్రమంలో కిరణ్ బాబు , మోండా అశోక్ , రాజన్న ,సురేష్ , శ్రీధర్ , గిరి , గంగాధర్ మూట , సతీష్ తదితర అభిమానులు పాల్గొన్నారు . థియేటర్ ఆవరణలో సీనియర్ అభిమానులు రాజు , రాములు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు
7) రాజమండ్రి అశోక థియేటర్ లో నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు తనూజ్ ఆధ్వర్యంలో ' భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా థియేటర్ లీజ్ సురేష్ మూవీస్ మేనేజర్ రమేష్ బాబు , జిల్లా పంపిణీదారులు కృష్ణ ఫిలిమ్స్ మేనేజర్ రాజు కేక్ కట్ చేయగా థియేటర్ సిబ్బందికి హాట్ బాక్స్ లు బిర్యానీ పాకెట్ లు పంపిణి జేశారు. ఏజెంట్ రవికి వెండిగ్లాస్ ని బహుకరించారు. వృద్ధ మహిళలకు చీరలు పంపిణి చేసారు . అయ్యప్ప , నరేష్ , మణికంఠ , ప్రిన్స్ రాజేష్ , ధోని , మనోహర్ , మురళి తదితర అభిమానులు పాల్గొన్నారు .
8) గుంటూరు పల్లవి థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ యువత అధ్యక్షుడు ఎం డి పర్వేజ్ చిష్టి , సురభి యేసు ఆధ్వర్యంలో ' భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ ను ఎమ్ ఎచ్ టి స్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజావళీ , టీడీపీ నాయకురాలు వెంకరమణ కేక్ కట్ చేసారు .పల్లవి థియేటర్ మేనేజర్ రమి రెడ్డి , లిబర్టీ థియేటర్ మజహర్ ఖాన్ లను ఘనంగా సత్కరించారు . గాయత్రీ ఫిలిమ్స్ రాజేంద్ర ప్రసాద్ , గౌస్ , ఫిరోజ్ , సాంబయ్య , అబ్రహం , రియాజ్ , నయీమ్ , శ్రీను , ఆసీఫ్ , అహ్మాద్ తదితర అభిమానులు పాల్గొన్నారు
9 ) తెనాలి లక్ష్మి కాంప్లెక్స్ లో పట్టాణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫాన్స్ అధ్యక్షులు కే. యశ్వంత్ కుమార్ , సయ్యద్ షావూలు ఆద్వర్యం లో "భారత్ అనే నేను " 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన డా . వాసిరెడ్డి శ్రీనాథ్ (చికాగో) , పద్మాలయా పి.ఆర్.ఓ. బాలాజీ శర్మ సంయుక్తానంగా కేక్ కట్ చేయగా, థియేటర్ సిబ్బంది కి దుస్తులను పంపిణి చేసారు .
ఈ సందర్బంగా సీనియర్ అభిమాని , ఈగల్ రెస్టారెంట్ యజమాని ఈదర పూర్ణచందర్ రావు మాట్లాడుతూ ఈ చిత్రం హిట్ అయ్యి 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు చిత్ర నిర్మాత దానయ్య , దర్శకుడు కొరటాల శివ , హీరో మహేష్ బాబు, లక్ష్మి కాంప్లెక్స్ వారికి అభిమాన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు . ముఖ్య అతిధి డా. శ్రీనాథ్ ఈ చిత్ర అర్థ శతదినోత్సవ వేడుకలకు గుంటూరు జిల్లా సీనియర్ అభిమాని గా నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో నాయుడు శ్రీను , రాఘవ , టి. నాగేశ్వర్ రావు , ఆది నారాయణ , మంగళ గిరి నవీన్ , చేబ్రోలు శశి , విజయవాడ కృష్ణ టీ స్టాల్ కృష్ణ మోహన్ , వేగి దుర్గ రావు , తదితర అభిమానులు పాల్గొన్నారు
10) కర్ణాటక ముల్ బల్గళ్ వరదరాజ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు కే వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ' భరత్ అనే నేను ' 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా థియేటర్ యజమాని రాంప్రసాద్ కేక్ కట్ చేయగా ఆయనకీ 50 రోజుల షీల్డ్ అందజేశారు .
ఈ కార్యక్రమంలో అనాధ పిలల్లకు నోట్ పుస్తకాలను పంపిణి చేసి అన్నదానం నిర్వహించారు. కే యన్ నాగరాజు , సుబ్రహ్మణ్యం , వి కోట భక్త , సురేష్ , గణ , మంజునాథ్ . కే యస్ హర్ష , కే యస్ వెంకటేష్ , బాలకృష్ణ అభిమాని రమణ , చిరంజీవి అభిమాని మండే నాగరాజు తదితరులు పాల్గొన్నారు .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout