భానుశంకర్ అర్ధనారి ట్రైలర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన నటీనటులు అర్జున్ యజత్, మౌర్యాని ప్రధాన తారాగణంగా భానుశంకర్ చౌదరి తెరకెక్కించిన చిత్రం అర్ధనారి. ఈ చిత్రాన్ని పత్తికొండ సినిమాస్ బ్యానర్ పై రవికుమార్.ఎమ్ నిర్మించారు. భరత్ రాజ్ సమర్పణలో రూపొందిన అర్ధనారి చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అర్ధనారి ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ రామారావు మాట్లాడుతూ...భానుశంకర్ టాలెంట్ కి తగ్గ సక్సెస్ రాలేదు. అర్ధనారి ట్రైలర్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ చిత్రంతో భానుశంకర్ కి మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ భానుశంకర్ మాట్లాడుతూ...ఈ కథని ఎంతో మంది హీరోలకు చెప్పాను...కథ బాగుంది చేద్దాం అనేవారు కానీ ఈ క్యారెక్టర్ చేయడానికి ధైర్యం చేసేవాళ్లు కాదు. మా నిర్మాతలు ఈ కథ గురించి తెలుసుకుని వేరే హీరోల దగ్గరికి వెళ్లే కన్నా మనమే ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. దాదాపు 40 కోట్లతో చేయాల్సిన సినిమా ఇది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు మాకు ఎంతగానో సహకరించారు. ఈ చిత్రంలో మౌర్య అనే కొత్త అమ్మాయి ప్రధాన పాత్ర పోషించింది. కొత్తమ్మాయి అయినప్పటికీ పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించింది. ఈ చిత్రాన్ని మా నిర్మాతలు ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మించారు. 85 రోజులు నిజామాబాద్ లో షూటింగ్ చేసాం. ఆతర్వాత రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేసాం. మొత్తం 95 రోజులు షూటింగ్ చేసాం. ఈ చిత్రంలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. అందుచేత ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేయలేదు. ఈ చిత్రాన్ని జులై 1న రిలీజ్ చేయనున్నాం. మేము మంచి ప్రయత్నం చేసాం. మా ప్రయత్నానికి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అన్నారు
హీరోయిన్ మౌర్య మాట్లాడుతూ...తొలి చిత్రంలోనే నటనకు అవకాశం ఉన్న పాత్రను పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆదరించి విజయాన్నిఅందించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమలో నిర్మాత రవికుమార్.ఎమ్, నిర్వహణ నిర్మాత కర్లపూడి కృష్ణ పాల్గొని అర్ధనారి చిత్రం విజయం సాధిస్తందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
నూతన నటీనటులు అర్జున్ యజత్, మౌర్యాని తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, ఫోటోగ్రఫీ సాయి శ్రీనివాస్ గాదిరాజు, సంగీతం రవివర్మ, లిరిక్స్ శ్రీవల్లి, రామాంజనేయులు, ఆర్ట్ డి.వై.సత్యనారాయణ, కొరియోగ్రఫి స్వర్ణ, ఫైట్స్ నందు, డ్రాగన్ ప్రకాష్, మాటలు నివాస్, నిర్మాత రవికుమార్.ఎమ్, నిర్వహణ నిర్మాత కర్లపూడి కృష్ణ, కథ స్ర్కీన్ ప్లే దర్శకత్వం భానుశంకర్ చౌదరి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments