ఆసక్తి పెంచుతున్న ‘భానుమతి రామకృష్ణ’ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకు ప్రారంభమైన పక్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’. 100% తెలుగు వెబ్ సిరీస్, సినిమాల స్ట్రీమింగ్ యాప్‌లో ప్రసారం కానున్న మరో ఎగ్జయిటింగ్ ప్రీమియర్ ‘భానుమతి రామకృష్ణ’. జూలై 3న ప్రీమియర్ ప్రసారం కానుంది. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం జాతీయ అవార్డు గ్రహీత, ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ విడుదల చేశారు.
‘దీని పేరు భానుమతి అప్పుడెప్పుడో సీతాకోకచిలుక సెకండ్ రిలీజ్ అప్పుడు పుట్టింది. దీంతో పాటు చదువుకున్న అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అమ్మాయిలందరికీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు కూడా అయిపోయాయి. ఇది మాత్రం ఏదో కుస్తీ పోటీలకు వెళ్లే దానిలో కసరత్తులు పడుతుంది’ అంటూ టీజర్లో మనకు హీరోయిన్ సలోని లూథ్రా చేసిన భానుమతి పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు.
‘రామ్రాజ్ బనీన్ మోడల్లా ఉన్నాడు చూశారా!.. వీడి పేరు రామకృష్ణ. బహూశా పదేళ్ల ఈ పేరు పెట్టుకుని బ్రతుకున్నోళ్లలో వీడొకడే ఉంటాడు. వీడి హాబీస్ పొద్దున లేవగానే స్ట్రీట్ లైట్లు కట్టేయడం. వేసవి కాలంలో ఫ్రెండ్స్‌తో కలిసి చలివేంద్రాలు పెట్టడం. సాయంకాలం పూట వీధి చివరన నిల్చుని ఆడ్రస్‌లు వెతుక్కునే వారికి సాయం చేయడం. వీడి ముప్పై మూడేళ్ల జీవితాశయం.. పెళ్లి చేసుకోవడం’ అంటూ హీరో నవీన్ చంద్ర పోషించిన రామకృష్ణ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు.
అంటే రెండు విభిన్నమైన క్యారెక్టర్స్.. ఒకరేమో పెళ్లి చేసుకోకూడదనే మనస్తత్వం ఉండేవారైతే, మరొకరేమో పెళ్లి చేసుకోవడమే జీవితాశయంగా ఉండేవారు. ఇలాంటి రెండు క్యారెక్టర్స్ ఓ ఆఫీసులో కలుసుకుని పరిచయం పెరిగిన తర్వాత వారి జీవితాల్లో జరిగిన మార్పులేంటి? చివరకు ఇద్దరి జీవితాలు చేరుకున్న మజిలీ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే మాత్రం జూలై 3న ఆహాలో ప్రీమియర్ చూడాల్సిందే.
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ సమర్పణలో క్రిషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ డిఫరెంట్ లవ్ జర్నీని శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించారు. సాయిప్రకాశ్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం హైలెట్‌గా నిలుస్తున్నాయి. క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout