ప్రేమ కథా చిత్రాలు అంటే.. ఓ పర్టికులర్ ఏజ్ అంటే దాదాపు పదిహేడు నుండి పాతికేళ్ల వయసుండే ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తాయనే భావన మన ప్రేక్షకులకు ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే కొత్త కాన్సెప్ట్ చిత్రాలకు ఆదరణ రావడం మొదలు అయ్యాయో మన దర్శకులు ఆలోచించే తీరు మారుతుంది. కొత్త కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ముప్పై ఏళ్లు దాటిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘భానుమతి అండ్ రామకృష్ణ’.
కథ:
సినిమా హైదరాబాద్ సిటీలో ప్రారంభమవుతుంది. అక్కడ ఓ పెద్ద కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉండే భానుమతి(సలోని లుత్రా)కి ముప్పై ఏళ్లు అవుతుంటాయి. కానీ పెళ్లి చేసుకోదు. అయితే ఐదేళ్లుగా రామ్(రాజా చెంబోలు)ను ప్రేమిస్తుంటుంది. అయితే భానుమతి తన వర్క్ టెన్షన్, ఇండిపెండెంట్ ఉమెన్ అనే భావన కారణంగా రామ్‌తో సరిగా మెలగదు. దాంతో రామ్ ఆమెను విడిచి పెట్టేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. భానుమతి రామ్‌ను మరచిపోయి తన పనిలో పడుతుంది. అదే సమయంలో తెనాలిలో ఉండే రామకృష్ణ(నవీన్‌చంద్ర) హైదరాబాద్‌లో భానుమతి పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం వస్తుంది. రామకృష్ణ హైదరాబాద్‌కు తనకు తెలిసిన వాళ్ల అబ్బాయి(వైవా హర్ష) రూమ్‌లో ఉంటాడు. రామకృష్ణకు ముప్పై మూడేళ్లయినా పెళ్లి కాదు.. సంబంధాలు చూసిన ఏదీ సెట్ కాదు. అదే సమయంలో తన జాబ్‌లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ భానుమతి సపోర్ట్‌తో రామకృష్ణ వాటిని దాటుకుని మంచి పేరు తెచ్చుకుంటాడు. అదే సమయంలో భానుమతికి బాగా దగ్గరవుతాడు. అయితే భానుమతికి తన ప్రేమను చెప్పడానికి ఇగో.. రామకృష్ణకేమో బిడియం.. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా రామకృష్ణ, భానుమతి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడేమౌతుంది? చివరకు భానుమతి, రామకృష్ణ ఒక్కటయ్యారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ‘భానుమతి రామకృష్ణ’ అయితే స్వర్గీయ నటి భానుమతిగారి కుమారుడు అబ్జక్షన్ చెప్పడంతో చివరి నిమిషంలో టైటిల్‌ను ‘భానుమతి అండ్ రామకృష్ణ’గా మార్చారు. ట్రైలర్‌లోనే దర్శకుడు తానేం చెప్పాలనుకున్నాడనే విషయాన్ని క్లియర్‌గా చెప్పేశాడు. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలతో మూడు పదుల వయసున్న హీరోయిన్, మూడు పదుల వయసు దాటిన హీరో మధ్య జరిగే ప్రేమ ప్రయాణమే ఈ చిత్రం. అయితే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కాకుండా సిటీ బ్యాక్‌డ్రాప్‌లో చూపించారు. హీరోయిన్ చిన్నప్పట్నుంచి పట్నంలో పెరగడం, ఇండిపెండెంట్‌గా ఉండటం వంటి కారణాలతో ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయాన్ని ముందు నుండి ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. ఇక హీరో క్యారెక్టర్ కూడా అర్బన్ ఏరియా కుర్రాడు.. ఎలా ఉంటాడనే విషయాన్ని కూడా చక్కగా చూపించారు. ఇద్దరి క్యారెక్టర్స్‌ను ఎలివేట్ చేయడం.. వారు కలుసుకునేలా చేయడంతో దాదాపు ఫస్టాఫ్ అయిపోతుందనే చెప్పాలి. ఇక హీరో కుటుంబంలో ఉండే చిన్న సమస్యను హీరోయిన్ ఎలా సాల్వ్ చేసింది. ఆమెకు ప్రతిఫలంగా హీరో ఏం చేయాలనుకుని ఇబ్బంది పడ్డాడు అనే అంశాలను సినిమాలో చూపించారు. కథలో గొప్ప ట్విస్టులు, టర్న్‌లు ఏం లేవు. చూస్తుండగానే అలా జరిగిపోతుంది. ఇక చివర్లో హీరో హీరోయిన్స్ కలుసుకునే సీన్ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తవుతుంది. కానీ కూల్ బ్రీజ్‌లాగా సాగిపోవడం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఈ మధ్య ఓటీటీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే వాటన్నింటి కంటే ఈ సినిమా బెటర్ అనే చెప్పొచ్చు. రెండు గంటల పన్నెండు నిమిషాల కథ అలా అయిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎడిటింగ్ బావుంది. క్షణం, ఈ మధ్య విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీల డైరెక్టర్ రవికాంత్ పేరెపు ఈ సినిమాను ఎడిట్ చేయడం ప్లస్ అయ్యిందనే చెప్పాలి. సినిమాకు ఎడిటింగ్ ప్లస్ పాయింట్‌గా మారింది. సాయిప్రకాశ్ ఉమ్మడి సింగుకెమెరా పనితనం బావుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, రాజు అచ్చుమణి నేపథ్య సంగీతం ఓకే అనిపించాయి. కథను ఎక్కడా దెబ్బ తీయలేదు.
సినిమాలో రెండు ప్రధాన పాత్రలు.. మిగిలిన పాత్రలన్నీ సహాయక పాత్రలే. ఈ రెండు పాత్రలను చక్కగా తీర్చిదిద్దారు. అయితే ఎక్కడా ఓవర్ డ్రామ, ఎమోషన్స్ లేవు. ఇంతకు ముందు చెప్పినట్లు కూల్‌గా వెళ్లిపోయే చిత్రం. ఈ సినిమాలో ఫన్‌ను పంచే పాత్రలో వైవా హర్ష చక్కగా నవ్వించాడు. మల్టీప్లెక్స్ మూవీ అనే భావనను కలిగించే అంశాలు చాలానే ఉన్నా.. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిది.
బోటమ్ లైన్: భానుమతి అండ్ రామకృష్ణ.. ఓ మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ

Rating: 2.75 / 5.0
Showcase your talent to millions!!
Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE
More
Comments