ఆరోపణలపై భానుప్రియ స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి భానుప్రియపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రభావతి పిర్యాదు చేసింది. తన కుమార్తె సంధ్యను భానుప్రియ వాళ్ల ఇంట్లో పనికి తీసుకెళ్లింది. పదివేల రూపాయల జీతం ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు రూపాయి జీతం కూడా ఇవ్వలేదు. తన కుమార్తెను భానుప్రియ తమ్ముడు లైంగికంగా వేధిస్తున్నాడని పక్కింటి వాళ్లు చెబితే తాను భానుప్రియకు ఫోన్ చేసి అడిగానని.. అయితే భానుప్రియ తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తుందని తెలిపింది.
అయితే ఆ ఆరోపణలపై భానుప్రియ స్పందించారు. తమ ఇంట్లో వస్తువులు దొంగతనం జరిగినట్లు గుర్తించి బాలికను అడిగామని.. ఆ అమ్మాయి ఆ వస్తువులను తన అమ్మ ప్రభావతికి ఇచ్చానని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసి వస్తువులను తిరిగి ఇవ్వమని అడిగితే.. తమపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు. దీనిపై పనికి కుదిరిన సంధ్య కూడా తాను వస్తువులను దొంగిలించి తన అమ్మకు ఇచ్చానని.. చోరీకి గురైనట్లు ఇంట్లో వాళ్లు తెలుసుకుని ఆ వస్తువులను తిరిగి ఇమ్మని అంటే తన అమ్మ తప్పుడు కేసు పెట్టిందని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout