Bhamakalapam 2:‘భామాకలాపం2’ సంచలనం.. ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..

  • IndiaGlitz, [Wednesday,February 21 2024]

జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం 2' ఓటీటీలో అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతు్నన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే వన్ మిలియన్ వీక్షకులతో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుంది. మూవీలో ప్రియమణి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. మొదటి పార్ట్ 'భామాకలాపం' బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెండో పార్ట్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణను దక్కించుకుంటోంది.

ఈ డైనమిక్ సీక్వెల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటోంది. కుటుంబప్రేక్షకులు, మరీ ముఖ్యంగా గృహిణులు ఎక్కువగా మూవీని వీక్షిస్తున్నారు. ఆహాలో భామాకలాపం 2 రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఒక మిలియన్ వీక్షకులతో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుంది. ఇక మున్ముందు కూడా హాట్ ఫేవరేట్‌గా మారి టాప్‌లో ట్రెండ్ కానుంది. ‘భామాకలాపం 2’కి వచ్చిన అద్భుతమైన స్పందన, ప్రేక్షకుల ప్రేమను చూసిన తర్వాత.. 'భామాకలాపం3' త్వరలో రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.

దీంతో తదుపరి భాగం కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు అభిమన్యు తడిమేటి క్రైమ్, కామెడీ ఇలా అన్నింటినీ కలిపి తీయడంతో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. గృహిణి పాత్రలో ప్రియమణి అద్భుతంగా నటించారు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమెతో పాటు శరణ్య ప్రదీప్ కామెడీతో సినిమా మరింత ఎంటర్టైనింగ్‌గా మారింది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక డ్రీమ్ ఫార్మర్స్, ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.

More News

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌ పోటీ చేసే నియోజకవర్గం ఇదే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భీమవరం పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు.

Vemireddy Prabhakar Reddy: అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా..

ఎన్నికల సమయంలో అధికార వైపీపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Nara Bhuvaneshwari:చంద్రబాబు గారికి విశ్రాంతి ఇచ్చి కుప్పం నుంచి నేను పోటీ చేస్తా: భువనేశ్వరి

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తుంటే.. మరోవైపు పొత్తుల నేపథ్యంలో టీడీపీ-జనసేన

Medaram Jathara: మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

తెలంగాణ కుంభమేళాగా పేరు గడించిన మేడారం మహా జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. గిరిజనుల ఆరధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లు మేడారం వైపే కదిలాయి.

SGT Posts:ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్టే విధించింది.