'భలే మంచి రోజు' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు - సుధీర్ బాబు, వామిక, ప్రవీణ్, పరుచూరి గోపాల కృష్ణ, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ధన్యభాలకృష్ణ, చైతన్య కృష్ణ తదితరులు
సంగీతం - సన్ని ఎం.ఆర్
కెమెరా - శ్యామ్ దత్
ఆర్ట్ - రామకృష్ణ
మాటలు - అర్జున్, కార్తీక్,
ఎడిటింగ్ - ఎం.ఆర్.వర్మ
బ్యానర్ - 70యం.యం.ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు - విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్ రెడ్డి
దర్శకత్వం - శ్రీరామ్ ఆదిత్య
ఎప్పుడో ప్రేమకథాచిత్రమ్‌తో సక్సెస్ అందుకున్న సుధీర్‌బాబుకు తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆ రేంజ్ సక్సెస్‌ను కట్టబెట్టలేకపోయాయి. అందుకే తనకి కొత్త జోనర్ అయిన క్రైమ్ కామెడిలో సినిమాలో నటించాడు. సినిమాను కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య చేతిలో పెట్టాడు. అయితే భలే మంచిరోజు చిత్రం సుధీర్‌బాబుకు మంచి రోజును తీసుకొస్తుందా లేదా అని తెలుగుసకోవాలంటే సిమా కథలోకి వెళ్ళాల్సిందే...
కథ
రామ్(సుధీర్బు తన ప్రేయసి మరొకరిని పెళ్ళి చేసుకోబోతుందని బాధలో ఉంటాడు. మధ్యలో నటడు ప్రవీణ్‌తో కలిసి తన మాజీ ప్రేయసిపై కొట్టాలని బయలు దేరుతాడు. అయితే అనుకోకుండా వారు బయలు దేరిన కారు యాక్సిడెంట్‌కు గురౌతుంది. ఆ యాక్సిడెంట్ కారణంగా కిడ్నాపర్ బారీ నుండి సీత(వామిక) తప్పించుకుంటుంది. సీతను కిడ్నాప్ చేయడానికి సుపారి తీసుకున్న శక్తి(సాయికుమార్)సీతను తెచ్చిస్తే ప్రవీణ్‌ను ప్రాణాలతో వదులుతానని కండిషన్ పెడుతాడు. ఆ కండీషన్‌పై రామ్ సీతను పట్టుకుంటాడు. అయితే మధ్యలోనే సీతకు నిజం తెలియడంతో రామ్‌కు సపోర్ట్ చేయాలనుకుంటుంది. అయితే రామ్‌తో చర్చికి వెళ్లిన సీత అక్కడ సూర్య(చైతన్యకృష్ణ)ను చూసి ఫైర్ చేస్తుంది. అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నంలోఅల్బర్ట్, వెన్సిస్(నల్లవేణు తన స్నేహితుడితో) నిజంగానే సీతను కిడ్నాప్ చేస్తారు. అసలు సీతను ఎవరు కిడ్నాప్ చేయమంటారు? ఎందుకోసం శక్తి అండ్ ఆదర్ గ్యాంగ్స్ సీత వెంబడి పడతారో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్
సుధీర్ బాబు ఈ సినిమాలో మరోసారి తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా స్టార్టింగ్ అయ్యే పాయింట్, సినిమాను నడిపిన తీరు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తుంది. సుధీర్ బాబు ఇంట్రడక్షన్ సీన్ బావుంటుంది. అలాగే శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుది. ప్రతి సీన్ లుక్ బావుంటుంది. రామకృష్ణ ఎడిటింగ్ వర్క్ బావుంది. జూనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మల్లిపుష్ఫం రామారావుగా చివర్లో పృథ్వి కామెడి సినిమా అంతటినీ ప్రేక్షకులను నవ్విస్తుంది. అలాగే సన్ని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెన్నుదన్నుగా నిలిచింది. ధన్య బాలకృష్ణ గెస్ట్ అప్పియరెన్స్ లా కొంత సేపే నటించినా తన అప్పియరెన్స్ బావుంది. సాయికుమార్ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడం కాకుండా కిడ్నాపర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. చైతన్యకృష్ణ పాత్రలో ట్విస్ట్ కనపడేలా చేయడం, ఆ సన్నివేశాలు బావుంటాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాను చక్కగానే నడిపించాడు. ఇంటర్వెల్ బ్లాక్ బావుంది. ప్రతి సన్నివేశాన్ని ముడిపెడుతూ సినిమాను నడిపించిన తీరు ప్రశంసనీయం.
మైనస్ పాయింట్స్
సినిమాలో అనుకున్న దానికంటే ఎక్కువగా మలుపులు ఉండటం ప్రేక్షకుడికి చిన్నపాటి కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది. సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ఎక్స్ ప్లెయిన్ చేసేటప్పుడు క్యూరియాసిటీ చల్లపడిపోతుంది. సినిమాను దర్శకుడు ఓ టెంపోలో తీసుకెళ్ళలేదు. పృథ్వీ కామెడి మినహ సినిమాలో చెప్పుకోదగినంత కామెడి రేంజ్ లేదు. పస్టాప్ స్లోగా ఉంది కదా అని అనుకుంటే సెకండాఫ్ అంతకంటే స్లో అయింది. డైలాగ్స ఎఫెక్టివ్ గా లేవు.
విశ్లేషణ
సుధీర్ బాబుకు తన చేసిన డిఫరెంట్ ప్రయత్నం అని చెప్పవచ్చు. పాత్ర పరంగా ఓవర్ హీరోయిజమ్ చూపించకుండా సుదీర్ బాబు పాత్రలో ఒదిగిపోయి చేయడం నచ్చుతుంది. సినిమాలో కొత్తగా చూపించిందేమీ లేదు. అక్కడక్కడా మెరడం తప్ప అందరూ ఫుల్ శాటిస్పై లేదు. సెకండాఫ్ లో సినిమాస్‌లో నేరేషన్ సినిమాను దెబ్బేసింది. శక్తిఅనే కిడ్నాపర్ పాత్రలో సాయికుమార్ నటన కొత్తగా కనపడుతుంది. చివరల్లో పృథ్వీ చేసిన కామెడి ప్రేక్షకులను ది. మొత్తం మీద సుధీర్ బాబు డిఫరెంట్ అటెంప్ట్ అనొచ్చు.
బాటమ్ లైన్
భలే మంచి రోజు`... డిఫరెంట్ కిడ్నాప్ డ్రామా
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments