భలే మంచిరోజు రిలీజ్ డేట్ ఫిక్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో సుధీర్ బాబు, వామిక జంటగా నటించిన చిత్రం భలే మంచి రోజు. ఈ చిత్రాన్నినూతన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు. ఇటీవల భలే మంచి రోజు ఆడియో రిలీజైంది. ఈ ఆడియో వేడుకలో...సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ...సుధీర్ బాబుకి సరైన సినిమా పడితే హీరోగా నిలబడిపోతాడు అన్నాడు. మహేష్ అన్న సరైన సినిమా ఇదే కావాలి అని సుధీర్ బాబు పక్కా ప్లాన్ తో ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడట. ఒక రోజులో జరిగే విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని క్రిస్మెస్ కానుకగా ఈనెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ బాబు ఫ్రెండ్స్ విజయ్, శశి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బెంగాల్ టైగర్ రిలీజ్ తర్వాత నుంచి ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడట. మరి...సుధీర్ బాబుకి కావాల్సిన విజయాన్ని భలే మంచిరోజు అందిస్తుందో..? లేదో..? చూడాలి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments