సుధీర్ కి ఒక హిట్ పడాలి - మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇవాళ ఆడియెన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొన్ని రోజుల ముందు భలే మంచిరోజు టీజర్‌ను యు ట్యూబ్‌లో చూశాను. డిఫరెంట్‌గా అనిపించింది. అలాగే ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ కూడా చాలా బావుంది. సుధీర్ చాలా హార్డ్‌వర్కింగ్ హీరో. తనకు ఒక హిట్ పడితే చాలు, స్టార్ అయిపోతాడు. అలాంటి హిట్‌ను ఈ సినిమాతో సాధిస్తాడని అనుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీరాంఆదిత్యలోమంచి ఎనర్జీ ఉంది. యూనిట్‌కు అభినందనలు అని సూపర్‌స్టార్ మహేష్ అన్నారు. 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుధీర్‌బాబు, వామిక జంటగా రూపొందిన చిత్రం భలే మంచిరోజు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. విజయ్‌కుమార్, శశిధర్ నిర్మాతలు. సన్నీ ఎం.ఆర్. సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న మహేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి సీడీని రానాకు అందించారు.
రానా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు. సుధీర్‌బాబు బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఈ చిత్రంలో చూస్తారు. సినిమా డైరెక్ట్ చేయాలనే నా కల నేరవేరిందని దర్శకుడు శ్రీరాం ఆదిత్య అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న సందీప్‌కిషన్, లగడపాటిశ్రీధర్, దిల్‌రాజు, దేవాకట్టా, మారుతి తదితరులు యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: సన్నీ ఎం.ఆర్, ఆర్ట్ డైరెక్టర్: రామ కృష్ణ, డైలాగ్స్: అర్జున్, కార్తిక్, కో డైరెక్టర్: శ్రీరామ్ ఎరగంరెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.టి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments