'భలే మంచి చౌక బేరమ్' టీజర్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్ తో నవీద్ , నూకరాజు లు హీరోలుగా, యామిని హీరోయిన్ గా ప్రముఖ నటుడు రాజారవీంద్ర ముఖ్యమైన పాత్రలో రోజులు మారాయి చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న ముడిదాని మురళి కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం భలే మంచి చౌక భేరమ్. 30 సంవత్సరాల మిలటరి అనుభవం తో దేశ రహస్యాలు మీద ఓ బుక్ రాస్తారు. అది ఆ ఆఫీసర్ నుండి మిస్సయితే ఎవరి చేతికైనా చిక్కితే అనే కాన్సెప్ట్ మీద ఈ చిత్రాన్ని రూపోందించారు.
ఈ చిత్రాన్ని ఎరోల్ల గ్రూప్ అదినేత డాక్టర్. డా ఎరోల్ల సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. హరి గౌరా సంగీతాన్ని అందిస్తుండగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని జె.బి అందిస్తున్నారు. పిడమర్తి రవి, రెహమాన్ లు సహ-నిర్మాతలు. దాసరి వెంకట సతీష్ లైన్ ప్రోడ్యూసర్ గా నిర్మాణ భాద్యతలు నిర్వహించారు. ఈ నెల 30న ఈ చిత్రానికి సంభదించి మెషన్ పోస్టర్ ని విడుదల చేశారు. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావటంతో ఈరోజు ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దర్శకుడు మారుతి, హీరో రాజ్ తరుణ్ లు హజరయ్యారు.
ముందుగా నటుడు రాజారవీంద్ర మాట్లాడుతూ.. ఈ చిత్రం లో నాకు చాలా మంచి పాత్ర ని మారుతి మరియు దర్శకుడు ఇచ్చారు. చాలా టాలెంటెడ్ దర్శకుడు మురళి గారు. రోజులు మారాయి చిత్రం కంటే ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధిస్తుంది. అలాగే నవీద్, నూకరాజు, యామిని ఇలా అందరూ దాదాపు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అందరూ చాలా బాగా నటించారు. డార్క్ కామెడి చిత్రాలు బాగా సక్సస్ అయ్యాయి. ఈ ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. తప్పకుండా మంచి సక్సస్ చిత్రం అవుతుంది.. అని అన్నారు.
హీరో నవీద్ మాట్లాడుతూ.. మా చిత్రాన్ని సపోర్ట్ చేయ్యాటానికి వచ్చిన రాజ్ తరుణ్ గారికి మా యూనిట్ తరుపున నా ప్రత్యేఖ ధన్యవాదాలు. ఇక ఈ చిత్రానికి మారుతి గారు కాన్సెప్ట్ ఇవ్వటమే సక్సస్ కొట్టేశాము. మా దర్శకుడు మురళి గారికి చేస్తున్న పని మీద క్లారిటి వుంటుంది. ఆయన మెదటి చిత్రం కూడా క్లారిటి మిస్ అవ్వదు. నాకు మంచి అవకాశాలు ఇచ్చి నన్ను ఇంతలా ప్రోత్సాహిస్తున్న మారుతి గారికి నా ప్రత్యేఖ దన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. రాజా రవీంద్ర గారు చాలా మంచి పాత్రలో నటించారు, అలాగే నా ఫ్రెండ్ గా నూకరాజు కామెడి చంపేశాడు. యామిని చాలా బాగా నటించింది. టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఈ చిత్రం వుంటుంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అని అన్నారు.
నూకరాజు మాట్లాడుతూ.. నాకు మరోక్క సారి మంచి పాత్రని ఇచ్చిన మారుతి గారికి, మురళి గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా లో నా పాత్ర చాలా ప్రత్యేఖంగా వుంటుంది. హింది మాట్లాడుతూ కామెడి చేస్తుంటాను. అల్ రెడి ట్రైలర్ లో చూశారు. ఈ సినిమా నాకు ప్రత్యేఖమైన గుర్తింపు తీసుకువస్తుంది. అని అన్నారు.
నిర్మాత డా ఎరోల్ల సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ.. మారుతి గారు కాన్సెప్ట్ లో మురళి గారు దర్శకుడు గా చేస్తున్న మా భలే మంచి చౌక భేరమ్ అనే చిత్రం ట్రైలర్ ని విడుదల చేశాము. అందరికి చాలా బాగా నచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఈ సమ్మర్ లోనే విడుదల చేస్తాము.. అని అన్నారు
దర్శకుడు మురళి మాట్లాడుతూ.. ముందుగా నాకు రెండవ అవకాశం ఇచ్చిన మారుతి గారికి నా హ్రదయపూర్వక ధన్యవాదాలు. చాలా కష్టపడి , ఇష్టపడి చేశాము మా నిర్మాత సతీష్ గారి సహయంతో చాలా బాగా చేశాము ఈచిత్రాన్ని, నటీనటులు అందరూ చాలా బాగా చేశారు. రాజా రవీంద్ర గారు చాలా మంచి పాత్రలో నటించారు. అలాగే అన్ని రకాలుగా ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. నాకు నా సినిమాకి రవి నంబూరి రాసిన మాటలు చాలా పెద్ద ఎస్సెట్ అవుతాయి. మారుతి గారు చెప్పిన కాన్పెప్ట్ చాలా బాగా డెవలప్ చేసాడు. చాలా మంచి డార్క్ కామెడి గా చేస్తున్నాం.. తప్పకుండా అందర్ని అలరిస్తుంది. అని అన్నారు
ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. మారుతి పెద్ద చిత్రాలు చేస్తూ కూడా ఇలా కాన్సెప్ట్ చిత్రాలు చేస్తూ పెద్ది విజయాలు సాధిస్తున్నారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా మంచిది. ఆయన ఎప్పూడూ కూడా సరిపడా బడ్జెట్ లో చిత్రాలు మంచి కాన్పెప్ట్ తో ఫాస్ట్ మేకర్ గా నిర్మాతకి నాలుగు రూపాయిలు మిగిలే విధంగా ప్లాన్ చేస్తారు. ఇది ఇండస్ట్రి కి శుభపరిణామం. అలాగే నాకు తెలిసి మారుతి గారు లోకల్ టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళలో మారుతి గారు మెదటి లైన్ లో వుంటారు. రేష్మ, రక్షిత, శ్రీదివ్య, యామిని, స్వాతి, నందిత ఇలా ఎంతో మంది తెలుగు హీరోయిన్స్ నే కాకుండా టెక్నికల్ టీం ని కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. ఆ కోవలేనే భలేమంచి చౌక భేరమ్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను. అని అన్నారు
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. మారుతి గారి చిత్రం అనగానే అది నా సొంత చిత్రంలా అనుకుంటాను. నవీద్, యామిని జంటగా మురళి గారు దర్శకత్వం చేసిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కొరుకుంటున్నాను. అన్నారు.
హీరోయిన్ యామిని మాట్లాడుతూ.. ఈ చిత్రానికి టైటిల్ పెట్టడానికి చాలా కష్టపడ్డారు. ఫైనల్ గా భలేమంచి చౌక భేరమ్ అని ఖరారు చేశారు. చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం లో చేసినవారందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మారుతి గారికి, మురళి గారికి నా ప్రత్యేఖ దన్యవాదాలు.. అని అన్నారు.
మారుతి గారు మాట్లాడుతూ.. నాకు ఎంతగానో ఇష్టమైన సతీష్ గారు నిర్మాతగా, నా స్రేహితుడు గుడ్‌సినిమా గ్రూప్ అధినేత శ్రీనివాస్ తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. మంచి కాన్సెప్ట్ చెప్పగానే దాన్ని ఎలా చెప్పానో అలాగే స్క్రీన్ మీదకి తీసుకువచ్చారు దర్శకుడు మురళి గారు.. రోజులు మారాయి చిత్రంతోనే నాకు ఆయన మీద మంచి కాన్ఫిడెంట్ వచ్చింది. ఆయన చాలా మంచి దర్శకుడు అవుతాడు. ఈచిత్రానికి కథ, మాటలు అందించిన రవి నంబూరి నేను చెప్పిన కాన్సెప్ట్ ని కథ గా మార్చి మంచి మాటలు అందించాడు. అలాగే నవీద్, యామిని చాలా బాగా నటించారు. నవీద్ కి మంచి యాక్టింగ్ స్కిల్స్ వున్నాయి. అలాగే నూకరాజు చాలా కష్టపడి హింది నేర్చుకుని ఈ పాత్రలో లీనమై నటించాడు. మ్యూజిక్, ఆర్ట్, మా ఎడిటర్ ఉద్దవ్ గారు అందరూ చాలా బాగా చేశారు.. ఈ ట్రైలర్ చాలా బాగుంది. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments