'భలే భలే మగాడివోయ్' టైటిల్ సాంగ్ రిలీజ్...

  • IndiaGlitz, [Monday,August 10 2015]

నాని హీరోగా జిఎ2, యువిక్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం భలే భలే మగాడివోయ్'. అల్లుఅరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మాతగా ఈ సినిమా నిర్మితమవుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మారుతి దర్శకుడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఫేమ్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

ఈ సినిమా టైటిల్ సాంగ్ ను ఈరోజు రేడియో మిర్చిలో విడుదల చేశారు. సినిమాలో టైటిల్ సాంగ్ కమర్షియల్ పంథాలో ఉంటుంది. ప్రతి సాంగ్ డిఫరెంట్ గా ఉండే గోపి సుందర్ మ్యూజిక్ ఇచ్చాడని, ఆడియో ఆగస్ట్ 15న విడుదల చేసి, సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని దర్శకుడు మారుతి, హీరో నాని తెలియజేశారు.