సెప్టెంబర్ 11న విజయవాడలో 'భలే భలే మగాడివోయ్ ' సక్సస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అరవింద్ సమర్పణలో, UV Creations మరియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపోందిన పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్' చిత్రం సెప్టెంబర్ 4న విడుదలయి సూపర్‌డూపర్ హిట్ టాక్ మరియు కలెక్షన్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. నాని పాత్ర తీరు మమ్మల్ని నవ్వించింది అని ఈచిత్రం చూసిన ఫ్యామిలి అంతా చెప్పటం విశేషం. చాలా రోజుల తరువాత ఫుల్ ప్లేడ్జ్గా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం రావటం హ్యపిగా వుందని ప్రేక్షకుల ఈ చిత్రానికి విజయరధం పట్టారు. దర్శకుడు మారుతి ని అభినందించారు. ఈ విజయాన్ని ప్రేక్షకుల తో పంచుకోవటానికి ఈనెల 11న ప్రేక్షకుల సమక్షంలో విజయోత్సవాన్ని విజయవాడ హయ్‌లాండ్ లో చిత్ర యూనిట్ జరుపుకుంటున్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ: మా చిత్రం 'భలే భలే మగాడివోయ్' అంచనాలకి మించి విజయాన్ని ప్రేక్షకులు మా యూనిట్ కి అందించారు.సినిమాలో చిన్న చిన్న సన్నివేశాలకు కూడా నవ్వుతుంటే చాలా ఆనందంగా వుంది. ప్రేమకథాచిత్రమ్ తరువాత ఇంతలా నవ్వించిన చిత్రం అంటూ దానిని మించి వుందని కూడా అంటున్నారు. ఈ విజయాన్ని ప్రేక్షకుల తో పంచుకోవటానికి ఈనెల 11న ప్రేక్షకుల సమక్షంలో విజయోత్సవాన్ని విజయవాడ హయ్‌లాండ్ లో ప్రేక్షకులతో కలిపి జరుపుకుంటున్నాము. . అని అన్నారు
నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ.. దర్శకుడు మారుతి మెదట చెప్పినట్టే 'భలే భలే మగాడివోయ్' ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది. . ఫ్యామిలి అంతా నవ్వుకునే విధంగా భలేభలేమగాడివోయ్ చిత్రం వుంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల తో పంచుకోవటానికి ఈనెల 11న ప్రేక్షకుల సమక్షంలో విజయోత్సవాన్ని విజయవాడ హయ్‌లాండ్ లో చిత్ర యూనిట్ జరుపుకుంటుంది " .అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments