అయిదేళ్లు పూర్తి చేసుకున్న 'భలే భలే మగాడివోయ్'
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ బ్యానర్లు పై బన్నీ వాసు నిర్మాతగా, డైనమిక్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ భలే భలే మగాడివోయ్. న్యాచులర్ స్టార్ నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై నేటితో అయిదేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మారుతి భలే భలే మగాడివోయ్ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాకి సంబంధించిన కొన్ని ఆఫ్ స్క్రీన్ విషయాలు తన ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సినిమాతోనే హీరో నానిని అంతా న్యాచురల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టినట్లుగా దర్శకుడు మారుతి ట్విట్ చేశారు. టైటిల్స్ లో హీరో నానికి ముందు న్యాచురల్ స్టార్ అనే బిరుదు ఈ సినిమా నుంచి తానే మొదలుపెట్టినట్లుగా మారుతి తెలిపారు. ఈ బిరుదుకి తగ్గట్లుగానే నాని తన న్యాచురల్ యాక్షన్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారని మారుతి అన్నారు. అలానే స్టార్ మా టీవీ వారు తనకు తెలిపిన వివరాలు ప్రకారం ఆ ఛానల్ లో అత్యధిక సార్లు టెలికాస్ట్ చేసిన కూడా భలే భలే మగాడివోయ్ అని మారుతి అన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ అందించారు. ఎస్ కే ఎన్ ఈ చిత్రానికి సహానిర్మాతగా వ్యవహరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments