అమెరికాలో 1.4 మిలియన్స్ కలెక్షన్లతో 25రోజుల సంబరాలు జరుపుకుంటున్న'భలే భలే మగాడివోయ్'
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అరవింద్ సమర్పణలో, UV Creations మరియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపోందిన పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్' చిత్రం సెప్టెంబర్ 4న విడుదలవటమే కాక సూపర్‌డూపర్ హిట్ టాక్ మరియు రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే 25 రోజుల దాటి శరవేగంగా స్టిల్ హౌస్‌ఫుల్స్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. నాని పాత్ర తీరు విశేషంగా ఆకట్టుకోవటం ఈ చిత్రానికి ఎసెట్ గా నిలిచింది. మారుతి ని ఈ చిత్రం అగ్రదర్శకుల జాబితాలో నిలిచేలా చేసింది. చాలా రోజుల తరువాత పక్కా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం రావటం హ్యపిగా వుందని ప్రేక్షకుల ఈ చిత్రానికి కలెక్షన్ల తో విజయఢంకా మెగించారు. ఇదిలా వుండగా ఓవర్సీస్ మార్కెట్ లో చాలా తక్కువ మంది దర్శకుల చిత్రాలు మాత్రమే రికార్డు కలెక్షన్లు రాబట్టటం చూశాం. ఇప్పుడు దర్శకుడు మారుతి 1.4 మిలియన్స్ కలెక్షన్ల తో ఓవర్సీస్ మార్కెట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం 25 రోజుల పూర్తయిన సందర్భంలో అమెరికాలో యూనిట్ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ: " మా చిత్రం 'భలే భలే మగాడివోయ్' అంచనాలకి మించి విజయాన్ని ప్రేక్షకులు మా యూనిట్ కి అందించారు. చిన్న చిత్రం పెద్ద చిత్రం అని విడదీస్తుంటే నాకు చాలా బాదవేసేది. మంచి కథతో ప్రేక్షకుల్ని నవ్వించడానికి తీసే ప్రతి చిత్రం పెద్ద చిత్రమే అని నా అభిప్రాయం. ఇవాల చాలా తక్కువ రోజుల్లో, లిమిటెడ్ బడ్జెట్ లో కథని , కథనాన్ని నమ్మి ప్రేక్షకుల్ని నవ్వించాలి అనేది మెయిన్ ఎజెండాగా పెట్టుకుని చేశాను. ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో టాప్ 10 చిత్రాల్లో మీది ఓకటి కలెక్షన్ల పరంగా అంటున్నారు. అంతేకాదు ఈ రేంజి చిత్రాల్లో మీదే నెంబర్ 1 అంటున్నారు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా వుంది. చిన్న చిత్రం పెద్ద చిత్రం అంటూ ఏమి వుండవు కేవలం మంచి చిత్రం మాత్రమే. అని మా భలేభలేమగాడివోయ్ నిరూపించింది. 1.4 మిలియన్స్ కలెక్షన్లు రావటం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా స్ట్రాంగ్ గా వెలుతుంది. ఈ ఘనవిజయం తెలుగు ప్రేక్షకులందరిది వారికి నా హ్రుదయపూర్వక దన్యవాధాలు, నా చిత్ర యూనిట్ మెత్తానికి మరోక్కసారి ధన్యవాదాలు " అని అన్నారు
నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ" దర్శకుడు మారుతి పెద్ద దర్శకుడు లిస్ట్ లో చేరాలని నాకున్న పెద్ద కోరిక.. అది మా భలేభలేమగాడివోయ్ చిత్రం తో తీరింది. ఈచిత్రం ఆల్మెస్ట్ ఓ పెద్ద బడ్జెట్ చిత్రాల రేంజి లో కలెక్షన్స్ చేయటం మా యూనిట్ అందరికి చాలా ఆనందంగా వుంది. మెము ముందు చెప్పినట్టే 'భలే భలే మగాడివోయ్' ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది. 25 రోజులు పూర్తయినా ఇంకా టికెట్స్ కోసం కాల్స్ వస్తుంటే ఆనందంగా వుంది. ముఖ్యంగా తెలంగాణా, ఆంద్రా, ఓవర్సీస్ లో రికార్డు కలెక్షన్లు వసూలూ చేసింది. ఇప్పటికి భాక్సాఫీస్ వద్ద నెం1 గా వుండటం ఆనందంగా వుంది " .అని అన్నారు.
నటీనటులు..నాని, లావణ్య త్రిపాఠి, మురళి శర్మ, నరేష్, సితార, స్వప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, బద్రమ్ మరియు తదితరులు..
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, ఎడిటర్:ఉద్దవ్,ఆర్ట్:రమణ వంక, ఫొటొగ్రఫి:నిజార్ షఫి, సంగీతం: గోపి సుందర్, నిర్మాత:బన్నివాసు , రచన, దర్శకత్వం:మారుతి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments