'భాయ్' ద‌ర్శ‌కుడు బ్యాక్‌

  • IndiaGlitz, [Monday,November 26 2018]

అహ నా పెళ్ళంట‌, పూల రంగ‌డు సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి. ఈయ‌న మూడో చిత్రంగా నాగార్జున‌తో 'భాయ్‌' సినిమా తెర‌కెక్కించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమా త‌ర్వాత వీర‌భ‌ద్ర‌మ్‌కు అవ‌కాశాలే రాలేదు. ఆ త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడు చేసిన చుట్టాల‌బ్బాయి చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

చాలా గ్యాప్ త‌ర్వాత వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రూపొంద‌నుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో హీరోగా న‌టించ‌బోతున్నాడట‌. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ క‌వ‌చంతో పాటు తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమా పూర్త‌యిన త‌ర్వాత వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌ట‌. జ‌న‌వ‌రిలో ఈ చిత్రం స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ట‌.

More News

సింగింగ్ టాలెంట్‌ను క‌లుసుకున్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి సింగింగ్ సెన్సేష‌న్ బేబిని త‌న ఇంట్లో క‌లిశారు. అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతుంది.

చోటాను వెనకేసుకొచ్చిన కాజ‌ల్‌

క‌వచం ఆడియో ఫంక్ష‌న్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కె.నాయుడు హీరోయిన్ కాజ‌ల్‌ని స్టేజీ పైనే ముద్దు పెట్టుకున్నాడు.

గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న విశాల్‌

హీరో, నిర్మాత‌, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ ఇటీవ‌ల గజ తుపాను బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' మెయిన్ స్టోరీ ఇదేనా?

'ఆర్ ఆర్ ఆర్‌'... మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా. ఎందుకంటే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డ‌మే కాదు..

విజ‌య్ స‌ర‌స‌న ఆమె క‌న్‌ఫ‌ర్మ్‌

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.