హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ కుమార్తె.. అది కూడా తెలుగులో..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సీనియర్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల పిల్లలు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమ క్రేజ్, పరిచయాలతో తమ వారసులకు బంగారు బాట వేయాలని నిన్నటి తరం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పలువురు సక్సెస్ అవ్వగా.. తాజాగా ఇంకొందరు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 80, 90 దశకాల్లో హీరోయిన్స్ గా నటించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ కూతుళ్లను హీరోయిన్స్‌గా పరిచయం చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ మాజీ హీరోయిన్ కూడా తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేయబోతుంది. ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన అందాల తార భాగ్యశ్రీ కూడా తన కుమార్తె అవంతికను ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తున్నారు. అదికూడా తెలుగు సినిమాతో కావడం విశేషం.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేశ్ హీరోగా రాబోతున్నాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మరో సినిమా కూడా ఓకే చేసినట్టు సమాచారం. ఈ మూవీలో బెల్లంకొండ గణేష్ సరసన అవంతికని హీరోయిన్‌గా తీసుకుంటామని నిర్మాతలు అడుగగా భాగ్యశ్రీ ఓకే చెప్పారని సమాచారం. దీంతో అవంతిక టాలీవుడ్‌తో తెరంగ్రేటం చేయబోతుంది. ఇక భాగ్యశ్రీ ‘రాధేశ్యామ్’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే అవంతికకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com