'ప్రేమ పావురాలు' హీరోయిన్ విడాకులు

  • IndiaGlitz, [Saturday,February 29 2020]

సల్మాన్‌ఖాన్‌, భాగ్య‌శ్రీ జంట‌గా రూపొందిన మైనే ప్యార్ కియా సినిమాను తెలుగులో ప్రేమ‌పావురాలు అనే పేరుతో అనువాదం చేశారు. ఆ సినిమా హిందీలోనే కాదు.. తెలుగులోనూ సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో హీరోయిన్ భాగ్య‌శ్రీ పేరు మారు మోగింది. అదే స‌మ‌యంలో ఆమె అనుకోకుండా పారిశ్రామిక‌వేత్త హిమాల‌యా ద‌స్సానీని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత చాలా కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన భాగ్య‌శ్రీ త‌ర్వాత తెలుగులో బాల‌కృష్ణ‌తో యువ‌ర‌త్న రాణా చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాల్లో నటిస్తూ వ‌చ్చింది.

కాగా.. ఈమె త‌న భ‌ర్త హిమాల‌య‌తో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‘‘ఇప్ప‌టికీ వెన్నులో వ‌ణుకు పుడుతోంది. హిమాల‌య‌పైనే ప్రేమ పుట్టింది. అతడినే పెళ్లాడాను కూడా. ఇప్పుడు మేం విడిపోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. నా జీవితంలో అత‌ని చోటు లేదా? ఏడాదిన్న‌రగా మేం విడిపోయి ఉంటున్నాం’’ అని చెప్పుకొచ్చింది.

హిమాలయ, భాగ్యశ్రీలకు అభిమన్యు అనే కొడుకు ఉన్నాడు. ఇటీవల అభిమన్యు ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ అనే సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేశారం. లేటెస్ట్‌గా ఈమె ప్ర‌భాస్ 20వ చిత్రంలో త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తుంది.