ప్లీజ్ నన్ను క్షమించండి..: డైరెక్టర్ భాగ్యరాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ ఆడవారిపై ఇటీవల నోటికొచ్చినట్లు మాట్లాడి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అత్యాచారాలు జరగటానికి కారణం ఆడవారేనని.. మహిళలు పద్దతీ పాడు లేకుండా ఉంటున్నారనీ కట్టుబాట్లను గాలికి వదిలేశారంటూ దారుణంగా మాట్లాడాడు. ఆడవాళ్లపై వేధింపులు జరిగినా.. అత్యాచారాలు జరిగినా దానికి కారణం వారేననీ వారి అజాగ్రత్త వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నాడు. ఒకప్పుడు మహిళలు పద్ధతి ఉండేవారని.. అయితే సెల్ఫోన్లు వచ్చిన తర్వాత అదుపు తప్పారని వ్యాఖ్యానించాడు. సెల్ఫోన్లు బాగా వాడుతున్నారనీ.. దీంతో అదే లోకం అన్నట్లుగా ఉంటున్నారు. అందుకే వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయ్ అని చెప్పుకొచ్చాడు.
క్షమించండి..!
అయితే అప్పట్లో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమే అయ్యాయి. దీంతో మహిళా సంఘాలు, పలువురు సోషల్ మీడియా.. మీడియా వేదికగా ఆయన మాటలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు. అంతేకాదు.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో డిసెంబర్ 2న కమిషన్ ముందు హాజరు కావాలని కోరగా ఆయన వెళ్లలేదు. అయితే ఇవాళ హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొల్లాచి సంఘటనలో జాగ్రత్తగా ఉండమని మహిళలకు చెప్పానన్నారు. అంతేకానీ.. తన అభిప్రాయాన్ని వక్రీకరించారని కమిషన్కు చెప్పానని భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు. ‘నేను మాట్లాడిన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి’ అని భాగ్యరాజ్ మీడియా ముఖంగా డైరెక్టర్ వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout