ఆడవారిపై డైరెక్టర్ భాగ్యరాజ్ అసభ్యకర వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయ నేతలే కాదు.. సినిమాలు నటించే డైరెక్టర్స్, నటులు సైతం నోరు జారుతున్నారు. అసలు ఏం మాట్లాడాలని స్టేజ్ ఎక్కుతారో.. ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితి. మైకు దొరికితే చాలు ఒకటే దంచుడే.. నోటి కొచ్చినట్లు మాట్లాడి అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలా టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకు చాలా మంది నటులు బుక్కవ్వగా.. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ ఓ కార్యక్రమంలో నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అత్యాచారాలు జరగటానికి కారణం ఆడవారేనని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగని ఆయన.. మహిళలు పద్దతీ పాడు లేకుండా ఉంటున్నారనీ కట్టుబాట్లను గాలికి వదిలేశారంటూ దారుణంగా మాట్లాడాడు. ఆడవాళ్లపై వేధింపులు జరిగినా.. అత్యాచారాలు జరిగినా దానికి కారణం వారేననీ వారి అజాగ్రత్త వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నాడు.
రెండు ఫోన్లు.. నాలుగు సిమ్‌లు..!
‘కరుత్తుగలై పదివుసెయ్’ సినిమా ఆడియో వేడుకలో మాట్లాడిన ఆయన.. ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు మహిళలు పద్ధతి ఉండేవారని.. అయితే సెల్‌ఫోన్‌లు వచ్చిన తర్వాత అదుపు తప్పారని వ్యాఖ్యానించాడు. సెల్‌ఫోన్‌లు బాగా వాడుతున్నారనీ.. దీంతో అదే లోకం అన్నట్లుగా ఉంటున్నారు. అందుకే వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయ్ అని చెప్పుకొచ్చాడు. ‘ఆడవాళ్లు ఒక్కొక్కరు రెండు ఫోన్లు వాడుతో రెండింటిలోను నాలుగు సిమ్‌లు వాడుతున్నారు. చాటింగ్‌లు చేస్తూ సంప్రదాయాల్ని కట్టుబాట్లలో వదిలేయటం..ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. అందుకే ఇలాంటి దారుణాతి దారుణాలు జరుగతున్నాయ్. గతంలో ఇటువంటి దారుణాలు జరగలేదు’ అని డైరెక్టర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
వివాహేతర సంబంధం కోసం..!
‘అంతేకాదు.. మహిళలు చనివిస్తేనే పురుషులు అవకాశంగా తీసుకుంటారు. నిజానికి పురుషులు తప్పు చేస్తే అది చిన్న విషయంగా ముగిసిపోతుంది. కానీ స్త్రీలు తప్పు చేస్తే అది పెను సమస్యకు దారితీస్తుంది. ఈ మధ్య వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను కూడా చంపేసిన మహిళలు గురించి వార్తల్లో చూస్తున్నాం. కానీ పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భార్యలను చూసుకుంటున్నారు’ అని భాగ్యరాజా చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రబుద్ధుడు మాట్లాడిన మాటలపై చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల మహిళలు.. మహిళా సంఘాల నేతలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com