ఈ నెల 26న వస్తున్న'భాగ్యనగరం'
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడలో కె.వి.రాజు దర్శకత్వంలో.. 'రాజధాని' పేరుతో రూపొంది, అక్కడ అసాధారణ విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'భాగ్యనగరం' పేరుతో సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సంతోష్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
కన్నడ రైజింగ్ స్టార్ యష్, 'బిందాస్' ఫేమ్ షీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సందేశాత్మక వినోదభరిత చిత్రంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషించగా.. డాన్సింగ్ సెన్సేషన్ ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేసింది. తులసి మరో ముఖ్య పాత్రధారి. ఈ చిత్రాన్ని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు ఈ చితాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.
నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. 'తొలుత ఓ మంచి డబ్బింగ్ సినిమా చేసి, ఆపై.. స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా.. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు 'భాగ్యనగరం' పేరుతో అందిస్తున్నాము. మా సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ కి ఈ చిత్రం కచ్చితంగా చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రం తెలుగులో కన్నడలో కంటే మరింత పెద్ద విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. ఈనెల 26న ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావుగారి ద్వారా విడుదల చేస్తున్నాం" అన్నారు.
ప్రముఖ నిర్మాత, భాగ్యనగరం' డిస్ట్రిబ్యూటర్ డి.ఎస్ రావు మాట్లాడుతూ.. "ఉజ్వల భవిషత్తు కలిగిన యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, మద్యపానం దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించే 'భాగ్యనగరం' వంటి మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. 'భాగ్యనగరం' చిత్రాన్ని ఈనెల 26న అతి త్వరలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments