భాగ్యశ్రీ భర్త అరెస్ట్
- IndiaGlitz, [Wednesday,July 03 2019]
భాగ్యశ్రీ అంటే ఎవరికీ ఠక్కున గుర్తుకు రాదేమో కానీ.. 'ప్రేమ పావురాలు' హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. ఈ అమ్మడు తొలి చిత్రం 'మైనే ప్యార్ కియా'(తెలుగులో ప్రేమపావురాలు)తో ప్రేక్షకుల అభిమానంతో పాటు అవార్డులు కూడా దక్కించుకుంది. ఆ సినిమా సమయంలోనే చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈమె సినిమా రంగానికి దూరంగా ఉన్నారు.
మధ్యలో బాలకృష్ణ 'యువరత్న రాణా'లో చెల్లెలు పాత్రలోనూ నటించింది. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా '2 స్టేట్స్' తెలుగు రీమేక్‌లోనూ నటించారు. ఈ సినిమా కొన్ని కారణాలతో ఆగింది. కాగా భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసాని గ్యాంబ్లింగ్ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. బెయిల్‌పై విడుదలయ్యారు. భాగ్యశ్రీ కొడుకు అభిమన్యు దాసాని హీరోగా కూడా ఈ ఏడాది పరిచయం అయ్యారు.