భాగమతితో కొనసాగింది
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా రాణిస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. మిర్చి చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకుల నమ్మకం చూరగొంది. అంతేగాకుండా, ప్రతి సంవత్సరం కూడా ఒక్క హిట్ అయినా ఈ సంస్థ నుంచి వస్తుండడం విశేషం. 2013లో మిర్చి, 2014లో రన్ రాజా రన్, 2015లో భలే భలే మగాడివోయ్ (భాగస్వామ్యం) , 2016లో ఎక్స్‌ప్రెస్ రాజా, 2017లో మహానుభావుడు చిత్రాలతో విజయాలు అందుకున్న ఈ సంస్థ.. ఈ ఏడాది కూడా ఆరంభంలోనే తన ఖాతాలో మరో హిట్‌ని సొంతం చేసుకుంది. ఆ విజయవంతమైన చిత్రం.. భాగమతి.
అనుష్క కథానాయికగా జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ హారర్ మూవీ.. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ విడుదలై మంచి విజయం సాధించింది. మొత్తానికి.. యువీ క్రియేషన్స్ ప్రతి ఏడాది ఓ హిట్ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రభాస్‌తో త్రిభాషా చిత్రం సాహో చిత్రం చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారమ్. అలాగే సుమంత్ అశ్విన్, నిహారికతో హ్యాపీ వెడ్డింగ్ చిత్రాన్ని మరో సంస్థతో కలిసి నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాలతోనూ సక్సెస్‌ని కంటిన్యూ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments