రజనీకాంత్ దెబ్బ స్పీల్ బర్గ్ కు కూడా తగిలింది...
- IndiaGlitz, [Saturday,July 09 2016]
హాలీవుడ్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన చిత్రం బి.ఎఫ్.జి ఈ చిత్రానికి తెలుగులో జగపతిబాబు వాయిస్ అందించడం విశేషం. తెలుగులో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, యాంబ్లిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై డిస్నీ బ్యానర్స్ సినిమాను విడుదల చేస్తున్నాయి. నిజానికి ఈ సినిమాను జూలై 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే కబాలి కారణంగా జూలై 22కు పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు సినిమా రిలీజ్ జూలై 22 నుండి జూలై 29కు మారేలా కనిపిస్తుంది. అందుకు కారణం రజనీకాంత్ కబాలి జూలై 22న వస్తుందని వార్తలు వినిపిస్తుండటమే. సెన్సార్ ఈ వారం పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే విడుదల తేది అధికారకంగా తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఇలా రజనీకాంత్ సినిమా ఎఫెక్ట్ స్పీల్ బర్గ్ వంటి దర్శకుడికి కూడా తప్పలేదన్నమాట.