రిలయన్స్ మరియు డిస్నీ వారి' ది బిఎఫ్ జి' చిత్రానికి విశేష స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వచ్చిన అద్భుతమైన ఫాంటసి చిత్రం, " ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)". డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం జులై 29 న విడుదలై విశేష ఆదరణ పొందుతోంది.
ఈ చిత్రం లో ని గ్రాఫిక్స్ అటు పిల్లలను ఇటు పెద్దవారినీ ఆకర్షిస్తున్నాయని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధి తెలిపారు. విడుదలైన అన్ని భాషలలోను చక్కటి రివ్యూస్ అందుకుంటున్న ఈ చిత్రం కుటుంబ సమేతం గా చూడదగినది అని చిత్ర బృందం చెబుతోంది. స్నేహపూర్వమైన మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగే అద్భుతమైన కథను స్టీవెన్ స్పిఎల్బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు.
ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రం లో ని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పటం విశేషం. ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com