కాల్ చేసి ఓటీపీ అడుగుతారు.. చెప్పారో అంతే సంగతులు!!
- IndiaGlitz, [Friday,July 26 2019]
ఇప్పటి వరకూ ఫోన్ నంబర్‌కు పలుమార్లు కాల్స్ రావడం.. ఓటీపీ చెప్పడం ఇలా మోసపోయామని పోలీసులు ఫిర్యాదు చేయడం.. ఇలాంటి వార్తలు టీవీల్లో్, పేపర్లో పెద్ద ఎత్తున వినేవుంటాం. తాజాగా ఇదే ఫోన్‌కాల్స్ విషయంలో పోలీసులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. దాదాపు మన మొబైల్ నెంబర్ తో పోలి ఉన్న నెంబర్ తోనే లేదా ఏదో ఒక నెంబర్ నుంచి కాల్ రావడం.. ఐస్ చేసినట్లుగా మాట్లాడి ఓటీపీ చెప్పించుకోవడం ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయట. చివరికి చూస్తే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
ఫోన్ చేసి ఇలా మాట్లాడుతారు..!
అయ్యా.. నేను ఉద్యోగం/ లేదా ఎదో రిజిస్ట్రేషన్ నిమిత్తం నా నెంబర్‌కి బదులు పొరపాటున మీ నెంబర్ ఇచ్చేశాను.. ఇప్పుడు మీ మొబైల్‌కి నా మొబైల్‌కి రావాల్సిన OTP వస్తుంది. కాస్త ఆ OTP నాకు చెప్పండి ప్లీజ్.. అలా ఐతే నాకు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారంటూ ఎంతో రిక్వెస్ట్ మానర్‌లో ఆ కాల్ ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళకు ఆ OTP చెప్పామా మన అకౌంట్లో డబ్బు గోవిందా..! అని పోలీసులు చెబుతున్నారు.
వాట్ నెక్ట్స్!!
కాగా ఆ OTPని ఉపయోగించి మన ఆన్లైన్ బ్యాంకింగ్‌ని వాడి అధీనంలోకి తెచ్చుకుంటాడు. కాబట్టి మన ఫోన్‌కు ఎలాంటి OTPలు వచ్చినా కూడా అవి ఇతరులకు చెప్పనవసరం లేదని గుర్తుంచుకోండని పోలీసులు బ్యాంకు ఖాతాదారులకు చెబుతున్నారు. వన్స్ మీరు పొరపడ్డారో అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త.