కాల్ చేసి ఓటీపీ అడుగుతారు.. చెప్పారో అంతే సంగతులు!!

  • IndiaGlitz, [Friday,July 26 2019]

ఇప్పటి వరకూ ఫోన్ నంబర్‌కు పలుమార్లు కాల్స్ రావడం.. ఓటీపీ చెప్పడం ఇలా మోసపోయామని పోలీసులు ఫిర్యాదు చేయడం.. ఇలాంటి వార్తలు టీవీల్లో్, పేపర్లో పెద్ద ఎత్తున వినేవుంటాం. తాజాగా ఇదే ఫోన్‌కాల్స్ విషయంలో పోలీసులు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. దాదాపు మన మొబైల్ నెంబర్ తో పోలి ఉన్న నెంబర్ తోనే లేదా ఏదో ఒక నెంబర్ నుంచి కాల్ రావడం.. ఐస్ చేసినట్లుగా మాట్లాడి ఓటీపీ చెప్పించుకోవడం ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయట. చివరికి చూస్తే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

ఫోన్ చేసి ఇలా మాట్లాడుతారు..!

అయ్యా.. నేను ఉద్యోగం/ లేదా ఎదో రిజిస్ట్రేషన్ నిమిత్తం నా నెంబర్‌కి బదులు పొరపాటున మీ నెంబర్ ఇచ్చేశాను.. ఇప్పుడు మీ మొబైల్‌కి నా మొబైల్‌కి రావాల్సిన OTP వస్తుంది. కాస్త ఆ OTP నాకు చెప్పండి ప్లీజ్.. అలా ఐతే నాకు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారంటూ ఎంతో రిక్వెస్ట్ మానర్‌లో ఆ కాల్ ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళకు ఆ OTP చెప్పామా మన అకౌంట్‌లో డబ్బు గోవిందా..! అని పోలీసులు చెబుతున్నారు.

వాట్ నెక్ట్స్‌!!

కాగా ఆ OTPని ఉపయోగించి మన ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ని వాడి అధీనంలోకి తెచ్చుకుంటాడు. కాబట్టి మన ఫోన్‌కు ఎలాంటి OTPలు వచ్చినా కూడా అవి ఇతరులకు చెప్పనవసరం లేదని గుర్తుంచుకోండని పోలీసులు బ్యాంకు ఖాతాదారులకు చెబుతున్నారు. వన్స్ మీరు పొరపడ్డారో అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త.

More News

పేరు మార్చుకుని సీఎంగా ‘యడియూరప్ప’ ప్రమాణం

కర్ణాటక కొత్త సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేశారు. కాగా మొదట శుక్రవారం నాడు ఇదివరకున్న యడ్యూరప్ప అనే పేరును ‘యడియూరప్ప’గా మార్చుకుని సీఎం పీఠమెక్కారు. రాజ్ భవన్‌లో గవర్నర్ వాజ్ భాయ్ వాలా..

'మనం సైతం' కు అండగా ఉంటా... కేటీఆర్

మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

'కొబ్బ‌రి మ‌ట్ట' నైజాం, ఒవ‌ర్‌సీస్ హ‌క్కులు సొంతం చేసుకున్న నో బారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

హ్రుద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో , కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో

చిరుకోసం పూరి ఇస్మార్ట్

రామ్ హీరోగా తెలంగాణ యాస‌లో మాస్ మ‌సాలాగా న‌టించిన సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని,

షాహిద్ ఎదురుదాడి

తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు.