'బేతాళుడు' వాయిదా పడనుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
నకిలీ, డా.సలీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ ఆంటోని `బిచ్చగాడు`తో కమర్షియల్‌గా సెన్సేషనల్ సక్సెస్‌ను అందుకున్నాడు. దాదాపు ముప్పై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో విజయ్ ఆంటోని నెక్ట్స్ మూవీ భేతాళుడుకి తిరుగులేని క్రేజ్ క్రియేట్ అయ్యింది. భేతాళుడు నిర్మాతలు అల్రెడి మంచి ప్రాఫిట్‌ను సంపాదించేసుకున్నారు. సినిమాను నవంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు భేతాళుడు అనుకున్న తేదీన విడుదల కావడం లేదట. కోలీవుడ్ నిర్మాతలు సినిమా విడుదల చేయడానికి ఆలోచనలో పడ్డారట. తెలుగు, తమిళంలో ఒకేసారి భేతాళుడు విడుదల కానుంది కాబట్టి తెలుగు రిలీజ్ కూడా ఆలస్యమవుతుంది. అసలు సినిమా విడుదలకు కారణం ప్రధాని మోడీ 500. 1000 నోట్లు క్యాన్సిల్ చేయడమేనట కారణం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments