బాహుబలి సీక్వెల్ కు అదిరిపోయే ఆపర్.....
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి పార్ట్ 2 ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ప్రభాస్, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్నీ ప్రెస్టిజియస్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి పార్ట్ 1 ఆరు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
మరిప్పుడు బాహుబలి పార్ట్ 2 ఎంత కలెక్ట్ చేస్తుందనే ఊహగానాలు అప్పుడే మొదలయ్యాయి. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని రాజమౌళి అండ్ టీం ప్రయత్నాలు చేస్తుంది. అయితే సినిమా నిర్మాణంలో ఉండగానే ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ ఓవర్‌సీస్ హక్కులను కె ఎంటర్‌టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ 95 కోట్లను చెల్లించి చేజిక్కించుకుందట. సినిమా చిత్రీకరణను నవంబర్‌కు పూర్తి చేసి తదుపరి నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments