'బెస్ట్ యాక్టర్స్' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతి మనిషి జీవితంలో నటిస్తాడు, ఇది నిజం అయితే ఎంత మోతాదులో ఆ నటన ఉంటుంది అనేది చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు మీద ఆధారపడి ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమే బెస్ట్ యాక్టర్స్. జీవితంలో.. అనే ఉపశీర్షిక పెట్టి సినిమా కథను చెప్పకనే చెప్పాడు దర్శకుడు అరుణ్ పవర్. మరి జీవితంలో నటించడానికి కారణమైన పరిస్థితులను గురించి దర్శకుడు ఏం చెప్పాడానికి నలుగురు యువకులతో చెప్పడానికి ప్రయత్నించాడు. అదేంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ
సినిమా హీరో తరుణ్ వాయిస్ ఓవర్ తో స్టార్టవుతుంది. నందు(నందు), తండ్రి బాగా డబ్బు సంపాదించడంతో జల్సాగా గడుపుతుంటాడు. అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేయాలని చూస్తుంటాడు. మధు(మధునందన్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన లవర్ ప్రేమ కావాలంటే ప్రమోషన్ కావాలి అందుకోసం రాత్రిపగలు ఆఫీస్ పనిచేస్తుంటాడు. కృష్ణ (నవీద్) ఓ టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, నాలుగోవాడు అభిరాం(అభిషేక్ మహర్షి) దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. అయితే వారిలో కృష్ణ తన లవర్ చేతిలో మోసపోతాడు. మధుకి ప్రమోషన్ రాదు. అభిరాంకి దర్శకుడిగా అవకాశం రాదు. దాంతో వారు కొన్నిరోజుల కొత్త ప్రదేశానికి వెళ్లాలని అనుకుని గోవాకి బయలు దేరుతారు. మరి అక్కడ వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అక్కడ నందు, మధులకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అర్చన ఎవరు? చివరికి నలుగురు జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో తెలుసుకోవాలంటే సినిమా చూడ్సాల్సిందే.
సమీక్ష
నందు క్యారెక్టర్ లో లవర్ బోయ్, ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లో నందు చక్కటి నటనను కనపరిచాడు. మధునందన్ ఎప్పటి కంటే ఈ సినిమాలో కొత్త పాత్రలో కనిపించాడు. కామెడి చేస్తూనే రొమాంటిక్ పాత్రలో నటించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు న్యాయం చేశాడు. అభిషేక్ దర్శకుడు కావాలనే యువకుడిగా, స్నేహితులకు సలహాలిచ్చే వ్యక్తిగా మంచి పెర్ ఫార్మెన్స్ చేశాడు. నవీద్ మోసపోయిన లవర్ గా, చివరకి తన ప్రేమ గెలిపించుకునే లవర్ గా నవీద్ తన పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో ట్విస్ట్ తీసుకుచ్చే మధురిమ, కేశ కంబటి గ్లామర్ పాత్రల్లో అందాల విందు చేశారు. సన్నివేశానికి తగినట్టు దర్శకుడు రాసుకున్న కామెడి సీన్స్ అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లయిమాక్స్ లో తాగుబోతు రమేష్, సప్తగిరి మధ్య వచ్చే కామెడి ట్రాక్ నచ్చుతుంది. జెబి సంగీతం బాగానే ఉంది. సినిమా ఎక్కడా లాగింగ్ గా లేకుండా ఉండేలా చేసిన ఉద్ధవ్ ఎడిటింగ్ బావుంది. విశ్వదేవబత్తుల సినిమాటోగ్రఫీ బావుంది. అయితే సినిమాలో మనసు తీరా నవ్వుకునే కామెడి సీన్ లేదు. థ్రిల్లింగ్ పాయింట్ ఒక్కటి కూడా కనపించదు. కథనం టైట్ గా కాకుండా ఏదో సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. సినిమా లెంగ్త్ తక్కువగా ఉన్నప్పటికీ సినిమాలో స్పీడ్ లేదు. ఎమోషనల్ పాయింట్ అనుకున్న రేంజ్ పండలేదు.
విశ్లేషణ
నలుగురు జంటలు వేరే ప్రదేశాలకు వెళ్లడం అక్కడ వారి ప్రేమకు సంబంధించిన నిజం తెలుసుకోవడమే కాన్సెప్ట్ పై చాలా సినిమాలు వచ్చాయి. గతంలో గ్రీన్ సిగ్నల్ సినిమా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఉంటుంది. దర్శకుడు అరుణ్ పవర్ సినిమాని ఆద్యంతం ఆసక్తిగా నడిపించడంలో ఫెయిలయ్యాడు. జెబి మ్యూజిక్, విశ్వదేవబత్తుల సంగీతం సినిమాకి వెన్నుదన్నుగా నిలిచాయి. అయితే సినిమా స్టార్టింగ్, ఎండింగ్ లో ఉన్న ఎమోషనల్ మూమెంట్ సినిమా రన్నింగ్ లో డ్రాప్ అయింది.
బాటమ్ లైన్: గుడ్ అటెంప్ట్ బెస్ట్ యాక్టర్స్
రేటింగ్: 2.75/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments