బీరుట్ ఘటన ఎఫెక్ట్.. భాగ్యనగర వాసుల్లో టెన్షన్ టెన్షన్..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌కు అమ్మోనియా నైట్రేట్ టెన్షన్ పట్టుకుంది. కీసర మండలం అంకిరెడ్డి పల్లెకు కంటైనర్స్ చేరుకున్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన భారీ పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ రసాయన పదార్థం ఇప్పుడు చెన్నై నుంచి 8 కంటైనర్లలో హైదరాబాద్‌కు చేరుకుంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన పేలుడులో 200 మంది మరణించగా.. వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా భారీ ఎత్తున పేలుడు సంభవించింది. అణుబాంబు దాడి తరహాలో విధ్వంసం చోటు చేసుకుంది.
ఈ పరిణామంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. తమ దేశాల్లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కడైనా ఉన్నాయా అనే విషయం ఆరా తీస్తున్నాయి. మన దగ్గర సాగర ప్రాంత నగరాలైన చెన్నై, విశాఖల్లో అమ్మోనియం నైట్రేట్ భారీ స్థాయిలో నిల్వ ఉంది. ఐదేళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను చైన్నై సమీపంలోని మనాలిలో ఉన్న టెర్మినల్ వద్ద 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు. కానీ గతంలో చెన్నై వరదల సమయంలో 50 టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్ నీటిలో, గాల్లో కలిసిపోయినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బీరూట్‌లో జరిగిన భారీ పేలుడుతో చెన్నై కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ 37 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ ఉండగా.. 10 కంటైనర్లలోని 181 టన్నుల రసాయన మిశ్రమాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు.
భాగ్యనగరానికి చెందిన ఓ సంస్థ ఈ అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసింది. పేలుడు స్వభావం ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలిస్తుండటం పట్ల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ప్రజల భద్రత విషయమై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని, ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె ట్వీట్ చేశారు. బీరూట్ ఘటన నేపథ్యంలో చెన్నై నుంచి అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్ వస్తుండటం పట్ల నగరవాసులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout