పర్స్‌లు కొట్టేస్తూ .. పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన నటి, వెలుగులోకి సంచలన విషయాలు

  • IndiaGlitz, [Monday,March 14 2022]

సాధారణంగా హీరోయిన్లు పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తే.. తమ అందాన్ని, వస్త్రధారణను చూపించేందుకు ప్రయత్నిస్తారు. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం, అభిమానులను పలకరిస్తూ.. నలుగురి చూపు తమ వైపు వుండేలా చూసుకుంటారు. అలాంటిది ఓ హీరోయిన్ ఏకంగా దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. వినడానికే విడ్డూరంగా వుంది కాదు. కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. బెంగాలీ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రూపా దత్తాకు మంచి పాపులారిటీ వుంది. ఈ క్రమంలో కలకత్తాలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ బుక్‌ఫేయిర్‌లో ఖాళీ పర్సు చెత్త బుట్టలో పడేస్తూ కనిపించింది.

అయితే ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా వుండటంతో.. పోలీసులు రూపాను తనిఖీ చేయగా.. బ్యాగ్‌లో ఎన్నో పర్సులు కనిపించాయి. అందులో రూ. 70వేలకు పైగా నగదు ఉంది. దీంతో ఆ నగదుతో పాటు ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని రూపాను ప్రశ్నించారు. ఈ క్రమంలో తానే దొంగతనానికి పాల్పడినట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే డబ్బుతో పాటు దొరికిన డైరీలో పలు సంచలన విషయాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.

అయితే రూపా దత్తాకు దొంగతనాలు చేయడం కొత్తేమి కాదని, గతంలోనూ ఆమె చాలా సార్లు చోరీలు చేసిందని పోలీసులు అంటున్నారు. వాటికి సంబధించిన వివరాలన్నీ డైరీలో రాసుకుందని .. ఈ విషయాన్ని రూపా కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కోల్‌కతాలోని రద్దీ ప్రదేశాలలో పిక్ ప్యాకెట్స్ చేసేదాన్ని అని, డబ్బు కోసమే ఇలా చేయాల్సివచ్చిందని రూపా దత్తా పేర్కొంది. కాగా.. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల రూపా దత్తా లైంగిక ఆరోపణలు చేసిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.