బెంగాల్ టైగర్ మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ వంటి స‌క్సెస్ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో స‌ర్దార్‌ గబ్బ‌ర్ సింగ్ సినిమా చేస్తాడ‌ని అంతా ఓకే అయ్యాడ‌ని అనుకున్న త‌రుణంలో, సంప‌త్ నంది ఉన్న‌ట్లుండి స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ నుండి డైరెక్ట‌ర్‌గా ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. అయితే ర‌వితేజ‌తో బెంగాల్ టైగ‌ర్ సినిమాను అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. కె.కె.రాధామోహ‌న్ నిర్మాత‌. ఓ ర‌కంగా చూస్తే రాధ‌మోహ‌న్‌కు ర‌వితేజ‌లాంటి స్టార్ హీరోతో చేయ‌డం మొద‌టిసారి. మ‌రి సంప‌త్ నంది ర‌వితేజ అభిమానులు, ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేసేలా సినిమా ఉంటుంద‌ని సంప‌త్ నంది బ‌లంగా చెప్ప‌డంతో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి సినిమా అంచ‌నాల‌ను అందుకుందా లేదా అని తెలియాలంటే స‌మీక్ష‌లోకి వెళ‌దాం...

క‌థ‌- కేశ‌వ పురం గ్రామంలోని ఆకాష్ నారాయ‌ణ్‌(ర‌వితేజ‌) త‌న బ్యాచ్‌తో తిరుగుతూ గొడ‌వ‌లు ప‌డుతుంటాడు. అత‌నికి పెళ్ళి చేస్తే దారికి వ‌స్తాడ‌ని అనుకుని సంబంధం చూస్తారు. పెళ్ళికూతురు(అక్ష‌) త‌న‌కు సాధార‌ణ‌మైన యువ‌కుడు వ‌ద్ద‌ని, సెల‌బ్రిటీని పెళ్ళి చేసుకోవాల‌నుంద‌ని, అన‌డంతో ఏదైనా చేసి వార్త‌ల్లోకెక్కాల‌నుకున్న ఆకాష్ ఊర్లో మీటింగ్‌కు వ‌చ్చిన వ్య‌వ‌సాయ శాఖామంత్రి(షాయాజీ షిండే)ని రాయి కొట్టి వార్త‌ల్లో నిలుస్తాడు. ఆకాష్ ధైర్యం న‌చ్చిన మినిష్ట‌ర్ త‌న ద‌గ్గ‌ర ప‌నిచేయ‌మ‌ని అడ‌గ‌డంతో స‌రేనంటాడు. ఇలాంటి సంద‌ర్భంలో రాష్ట్ర హోం మినిష్ట‌ర్ నాగ‌ప్ప‌(రావు ర‌మేష్‌), కూతురు శ్ర‌ద్ధ‌(రాశిఖ‌న్నా)ను ప్ర‌త్య‌ర్థులు గ‌విరెడ్డి నుండి ర‌క్షించ‌డంతో హోం మినిష్ట‌ర్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చేయ‌మ‌ని అడ‌గ‌డంతో హోం మినిష్ట‌ర్ ద‌గ్గ‌ర ప‌నిలో చేరుతాడు. కానీ అక్క‌డ అకాష్ మ‌రోసారి ఇబ్బందుల్లోని శ్ర‌ద్ద‌ను కాపాడ‌టంతో శ్ర‌ద్ధ ఆకాష్‌నే పెళ్ళి చేసుకుంటానంటుంది. ఓ ఫంక్ష‌న్‌లో త‌న కూతురు శ్ర‌ద్శ‌ను ఆకాష్‌కిచ్చి పెళ్ళి చేస్తాన‌ని నాగ‌ప్ప అంటాడు. కానీ తాను సి.ఎం.అశోక్ గ‌జ‌ప‌తి(బోమ‌న్ ఇరాని) కుమార్తె మీరా(త‌మ‌న్నా)ను ప్రేమిస్తున్నానని అన‌డంతో అంద‌రూ షాక‌వుతారు. మీరా కూడా ఆకాష్ క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో అత‌న్ని ప్రేమిస్తుంది. ఇది న‌చ్చ‌ని అశోక్ గ‌జ‌ప‌తి, ఆకాష్ పై దాడి చేస్తాడు కానీ ఫ‌లిత‌ముండ‌దు. అలాంటి ప‌రిస్థితుల్లో అశోక్ గ‌జ‌ప‌తి ఏం చేస్తాడు? అస‌లు ఆకాష్ ఎవ‌రు? ఎందుకు మీరాను ప్రేమిస్తాడు? ఆకాష్ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్

ర‌వితేజ పుల్ ఎనర్జీతో న‌టించాడు. ర‌వితేజ బాడీలాంగ్వేజ్‌కు త‌గిన క‌థ కావ‌డంతో ఆకాష్ నారాయ‌ణ్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. కిక్‌2 మీద లుక్ ప‌రంగా ఈ చిత్రంలో బాగానే క‌నిపించాడు. యాజ్ యూజువ‌ల్ త‌నదైన స్ట‌యిల్ ఆఫ్ ఫైట్స్‌, డ్యాన్సులతో మురిపించాడు. త‌మ‌న్నా, రాశిఖ‌న్నాలు గ్లామ‌ర్ ప‌రంగా ఆక‌ట్టుకున్నారు. పెర్‌ఫార్మెన్స్ వీరి నుండి ఆశించ‌డం త‌ప్ప‌వుతుంది. సి.ఎం. పాత్ర‌లో బోమ‌న్ ఇరాని చ‌క్కగా న‌టించాడు. మెయిన్ విల‌న్‌గా ఇరాని పాత్ర‌కు ప్రాణం పోశాడు. ఇక రావు ర‌మేష్‌, షాయాజీ షిండేలు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సెల‌బ్రిటీ శాస్త్రి పాత్ర‌లో పోసాని కామెడి సూప‌ర్‌. ర‌వితేజ ప్లాన్‌ను ప‌సిగ‌ట్టి చెప్ప‌లేని ప‌రిస్థితిగా ఉండే పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయాడు. కొత్త స్ట‌యిల్ ఆఫ్ కామెడిని పండించాడు. ఇక ఫ్యూచ‌ర్ స్టార్ సిద్ధ‌ప్ప‌గా పృథ్వీ కామెడి హైలైట్‌. హీరో కావాల‌నుకునే పాత్ర‌లో కామెడిని అద్భుతంగా చేశాడు. రావ రమేష్‌కు త‌న‌కు సినిమాపై ఉన్న ప్రేమ‌ను వివ‌రించే సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట‌యిల్ ఆఫ్ డైలాగ్ ఆడియెన్స్‌ను న‌వ్విస్తుంది. అలాగే హాస్యం అంటే చిటెకెలు వేస్తూ చేసే మేన‌రిజం బావుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం బావుంది. యాడ నుండి వ‌చ్చినావురో సాంగ్‌...చూపుల‌కే దీపాలా..., సాంగ్స్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటాయి. మిగ‌తా సాంగ్స్ కూడా బావున్నాయి. చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖ్యంగా క్ల‌యిమాక్స్‌లో బుర‌ద ఫైట్‌లో వ‌చ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. సౌంద‌ర్‌రాజ‌న్ కెమెరా వ‌ర్క్ బావుంది. ప్ర‌తి ఫ్రేమ్‌లో క్లారిటీ క‌న‌ప‌డుతుంది. ఎడిటింగ్ బావుంది. ఎక్క‌డా లాగిన‌ట్టు కాకుండా సినిమా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో సాగిపోతుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

మైన‌స్ పాయింట్స్‌

క‌మ‌ర్షియ‌ల్ స్ట‌యిల్‌లో చ‌క‌చ‌క సాగిపోయే సినిమా కాబ‌ట్టి సినిమాలో కొత్త‌ద‌న‌మేదీ ఆశించ‌లేం. బ్ర‌హ్మానందం టీవీ ఎపిసోడ్ వేస్ట్‌గా అనిపిస్తుంది. బెంగాల్ టైగ‌ర్ టైటిల్ సాంగ్ గ‌బ్బ‌ర్ సింగ్ టైటిల్ సాంగ్ త‌ర‌హాలో క‌న‌ప‌డుతుంది. ఒక కామ‌న్ మ్యాన్ ల‌వ్ చెప్ప‌గానే హీరోయిన్ అత‌నికి ఓకే చెప్ప‌డ‌యం సిల్లిగా అనిపిస్తుంది. అందుకు బ‌ల‌మైన రీజ‌న్స్ ఏదీ చూపెట్ట‌లేదు.

విశ్లేష‌ణ‌

సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో బెంగాల్ టైగ‌ర్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ అన‌గానే ఎలా హ్యండిల్ చేస్తాడోనని అనుకున్నారంతా కానీ సంప‌త్ ఎక్క‌డా తొట్రుపాటుకు గురికాలేదు. చాలా క్లారిటీతో సినిమాను తెర‌కెక్కించాడు. అందుకు సౌంద‌ర్‌రాజ‌న్ త‌న స్ట‌యిల్ ఆఫ్ సినిమాటోగ్ర‌ఫీతో మ‌రింత అందాన్ని తెచ్చి పెట్టాడు. త‌మ‌న్నా, రాశిఖ‌న్నాలు సినిమాల‌కు గ్లామ‌ర్ అద్దారు. భీమ్స్ సంగీతం, చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా కామెడి ట్రాక్‌ను చ‌క్క‌గా హ్యండిల్ చేశాడు. అందుకు పృథ్వీ, పోసానిలు బాగా స‌పోర్ట్ చేశారు. డైలాగ్స్‌లో ఎదిగిన‌వాళ్ళని కాకుండా ఎదిగే టాలెంట్ ఉన్న‌వాళ్ల‌నే కూతుళ్శ‌కిచ్చి పెళ్ళి చేయాలి. ఎదుగుతాడ‌ని ఎన్టీఆర్‌, చంద్ర‌బాబుని అల్లుడ‌ని చేసుకున్నాడు. అల్లురామ‌లింగ‌య్య‌, చిరంజీవిని అల్లుడు చేసుకున్నాడు అనే డైలాగ్‌.., సౌత్‌లో ర‌జనీకాంత్ లాంటి సూప‌ర్‌స్టార్ లేడ‌ని అనుకున్నాం కానీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాలేదా అని పోసాని చెప్పే డైలాగ్‌, ప‌వ‌ర్‌స్టార్ పార్టీకి స‌పోర్ట్ చేస్తే ప్ర‌జ‌లు ఓట్లు గుద్దేయ‌లేదా అని చెప్పే డైలాగ్స్ మెగా ఫ్యామిలీ అభిమానులు ఆక‌ట్టుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. ర‌వితేజ మేన‌రిజ‌మ్స్ అక్క‌డ‌క్కడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గుర్త‌కు తెస్తాయి. హీరోపై త‌మ‌న్నాకు ల‌వ్ పుట్టే రీజ‌న్ క‌న్విసింగ్‌గా అనిపించ‌లేదు. బ్ర‌హ్మీ ఏపిసోడో ఇరికించిన‌ట్టుంది.

బాట‌మ్ లైన్‌

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఎంజాయ్ చేయాల‌నుకునే ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. 'బెంగాల్ టైగ‌ర్'...అవుటండ్ అవుట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌

రేటింగ్: 3/5

More News

జనానికి నచ్చని కథలతో సినిమా చేస్తానంటున్న రవితేజ...

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.

సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ తో విక్రమ్ కుమార్..

13బి,ఇష్క్ చిత్రాలతో విజయాలు సాధించి మూడు తరాల అక్కినేని హీరోలతో మనం సినిమాని తెరకెక్కించి ఇండస్ట్రీలో అందరి ద్రుష్టి ఆకర్షించిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.

శ్రీ శ్రీ గురించి సూపర్ స్టార్ కామెంట్..

సూపర్ స్టార్ క్రిష్ణ,విజయనిర్మల,నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీ శ్రీ.ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ సాయిదీప్,బాలు రెడ్డి,షేక్ సిరాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాబాయ్ బాలయ్య తో పోటీకి రెఢీ అంటున్న అబ్బాయ్ ఎన్టీఆర్...

నందమూరి నట సింహంబాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

డిసెంబర్ 25న విడుదలవుతున్న 'జత కలిసే'

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం,ఓక్ ఎంటర్ టైన్మెంట్స్,యుక్త క్రియేషన్స్ బ్యానర్స్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న చిత్రం 'జత కలిసే'.