బెంగాల్ టైగర్ రిలీజ్ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాథామోహన్ ఈ సినిమాని నిర్మించారు.రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నా నటించారు. ఇటీవల బెంగాల్ టైగర్ ఆడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆడియోకు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో కిక్ 2 తో విజయం సాధించలేకపోయినా... బెంగాల్ టైగర్ తో విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు రవితేజ.
ఇక అసలు విషయానికి వస్తే...బెంగాల్ టైగర్ మూవీని నవంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అయితే అఖిల్ మూవీ నవంబర్ 11న రిలీజ్ అవుతుండడంతో బెంగాల్ టైగర్ మూవీని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. నవంబర్ 27న బెంగాల్ టైగర్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com