బెంగాల్ టైగ‌ర్ రిలీజ్ వాయిదా..

  • IndiaGlitz, [Monday,November 16 2015]

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన‌ తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా న‌టించారు. రాథా మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన బెంగాల్ టైగ‌ర్ చిత్రాన్ని ఈనెల 6న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ అఖిల్ మూవీ రిలీజ్ వ‌ల‌న బెంగాల్ టైగ‌ర్ మూవీని ఈనెల 27కి వాయిదా వేసారు.

ఇప్పుడు ఈనెల 27న బెంగాల్ టైగ‌ర్ రిలీజ్ అవుతుంది అనుకుంటుంటే ఈనెల 27న అనుష్క సైజ్ జీరో మూవీ రిలీజ్ అవుతుంది అందువ‌ల‌న బెంగాల్ టైగ‌ర్ మూవీని మ‌ళ్లీ వాయిదా వేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం బెంగాల్ టైగ‌ర్ మూవీని డిసెంబ‌ర్ 10న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి...ఈ డేట్ అయినా ఫిక్స్ చేస్తారో...లేక‌ మ‌ళ్లీ వాయిదా వేస్తారో చూడాలి.

More News

సైజ్ జీరో సెల‌బ్రిటీల లిస్ట్

లావుగా ఉన్న అమ్మాయికి పెళ్లి కాకపోతే ఆమె తల్లి ఎంతో బాధపడుతుంది. పెళ్లి చేసుకోవడం కోసం తగ్గే సన్నాహాల్లో ఉన్న అమ్మాయి ఏం చేసింది? అనే కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా సైజ్ జీరో.

నిర్మాత‌ల హీరో, వ‌ర్క్ హాలిక్‌...నారా రోహిత్‌

తొలిచిత్రం ‘బాణం’ నుండి విల‌క్ష‌ణ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ హీరో నారా రోహిత్. ‘సోలో, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో, అసుర’ చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

ప్ర‌భాస్ గోల్డెన్ హార్ట్

కుడి చేత్తో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియ‌కూడ‌ద‌ని అంటారు. ఆ విష‌యాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాల‌న్న‌ది ప్ర‌భాస్ సిద్ధాంతం.

'ఐతే' రీబూట్ వెర్షన్ 'ఐతే 2.0/పైరేట్స్‌ 1.0' - దర్శకుడు రాజ్ మాదిరాజ్

ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న సినిమా ‘ఐతే2.0/పైరేట్స్ 1.0’. ఫర్మ్‌ 9 బ్యానర్‌పై రాజ్ మాదిరాజ్ దర్శకత్వం తెరకెక్కుతోంది.

నిర్ణ‌యం మార్చుకున్న ధ‌నుష్‌..

తమిళ హీరో ధ‌నుష్‌..ఓ ప‌క్క వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తూనే...మ‌రో ప‌క్క మంచి చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు.