'బెంగాల్ టైగర్' రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
బలుపు`, పవర్` వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. అఖిల్ సినిమా రిలీజ్ వల్ల సినిమాను నవంబర్ 26 లేదా 27న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com