ఆంద్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో వందలాది బస్ ల్లో 'బెంగాల్ టైగర్' ప్రమోషన్స్

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, అందాల భామ‌లు త‌మ‌న్నా, రాశిఖ‌న్నాలు జంట‌గా, సంప‌త్ నంది ద‌ర్వ‌క‌త్వంలో, నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్‌టైగ‌ర్ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 10న విడుద‌ల కానుంది. బీమ్స్ సంగీతం అందించారు.

సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో వ‌చ్చిన ప్ర‌తిచిత్రం కూడా ప్ర‌మెష‌న్ పరంగా దూసుకువెల్ల‌ట‌మే కాకుండా వినూత్నంగా ప్ర‌మోట్ చేయటం ఈ సంస్థ‌కి పెట్టింది పేరు. ఇప్పటికే ప్ర‌మోష‌న్ లో దూసుకుపోతున్న‌ బెంగాల్ టైగ‌ర్ చిత్రం ఇప్పుడు ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో వంద‌లాది బ‌స్సుల‌పై ప్ర‌మెష న్ యాక్టివిటి ని స్టార్ట్ చేశారు. రోజులో దాదాపు రెండు రాష్ట్రాల్లో కోటి కి పైగా ప్ర‌యాణికులు బ‌స్ ప్ర‌యాణం చేస్తుంటారు. అలా ప్ర‌యాణం చేసిన ప్ర‌తి ఓక్క‌రికి బెంగాల్ టైగ‌ర్ చిత్రాన్ని చేరాల‌ని ,ప్ర‌తి సినిమా ప్రేక్ష‌కుడి ద‌గ్గ‌ర‌కి తీసుకువెళ్లాల‌నే వుద్దేశంతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ప్ర‌మోష‌న్ యాక్టివిటి చేస్తున్నారు..డిసెంబ‌ర్ 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.అని నిర్మాత కె.కె.రాదామెహ‌న్ అన్నారు