బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు 101% హిట్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బెంగాల్ టైగర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఇప్పటి వరకు మీరు చేసిన పాటలు గురించి చెప్పండి..?
సంగీత దర్శకుడిగా నా మొదటి చిత్రం నువ్వా నేనా. ఈ చిత్రంలో వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే...సాంగ్ ఎంత పెద్ద హిట్టు అయ్యిందో తెలిసిందే. ఆతర్వాత కెవ్వుకేక మూవీకి మ్యూజిక్ అందించాను. ఇందులో బాబు ఓ రాంబాబు...అనే సాంగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది. అలాగే గాలిపటం మూవీలో పొద్దున్నే ఏమిటిరా పొంగలు తినడం.., జోరులో పప్పరా పాప సాంగ్ బాగా హిట్ అయ్యాయి. అలా ఎలా మూవీకి కూడా మ్యూజిక్ అందించాను.ఇప్పుడు బెంగాల్ టైగర్ తో నాకు డబుల్ హ్యాట్రిక్ అందించిన ఆడియోన్స్ కు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
బెంగాల్ టైగర్ పాటలు గురించి..?
బెంగాల్ టైగర్ లో ఐదు పాటలుంటాయి. మొదటిపాటను రామజోగయ్య శాస్త్రి, రెండవ పాటను సంపత్ నంది,మూడవ పాటను శ్రీమణి, నాలుగవ పాటను భాస్కరభట్ల, ఐదవ పాటను సుద్దాల అశోక్ తేజ రాసారు.ఆసియా ఖండం అనే పాటను నూతన అనే కొత్తమ్మాయితో పాడించాను. ఆ అమ్మాయికి అవకాశాలు కూడా వస్తుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో చూపులతో దీపాలా... అనే సాంగ్ ఉంది.
ఈ పాట హిట్ అవ్వడం అనేది పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నాను. భీమ్స్ అనగానే ఫోక్, ఫాస్ట్ బీట్ సాంగ్సే చేస్తాడనే ముద్ర పడింది. ఆ ముద్ర నుంచి నన్ను బయటపడేసింది చూపులతో దీపాల సాంగ్.
భీమ్స్ అంటే ఫోక్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ చేస్తాడనే ముద్ర ఉంది కదా. ఆ ముద్ర నుంచి బయపడడం కో్సమే మెలోడీ సాంగ్ చేసారా..?
ఆ ముద్ర నుంచి బయటపడడం కో్సమని మెలోడి సాంగ్ చేయలేదు. ఇంతకు ముందు కూడా నువ్వా నేనా లో తత్త తామరవే అనే మెలోడి సాంగ్ చేసాను. కానీ టైం కలసి రాక అంతగా పాపులర్ కాలేదు.ఈ సినిమాలోనే నీలినీలి కన్నులే సాంగ్ చేసాను. ఈరెండు పాపులర్ కాకుండా వయ్యారి బ్లాక్ బెర్రి వర్కవుట్ అయ్యింది.జోరులో పువ్వులకు రంగేయాలా.. అనే మెలోడి సాంగ్ చేసాను. కానీ ఆశించిన స్ధాయిలో పాపులర్ కాలేదు. నేను చేసిన ప్రతి సినిమాలో మెలోడి సాంగ్ చేసాను. కానీ.. ఎందుకనో హిట్ కాలేదు. భీమ్స్ అంటే ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు మెలోడి సాంగ్స్ కూడా చేయగలడని నిరూపించింది బెంగాల్ టైగర్. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన సంపత్ నంది గార్కి, నిర్మాత కెకె రాధామోహన్ గార్కి రవితేజ గార్కి థ్యాంక్స్ చెబుతున్నాను.
ఫస్ట్ టైం రవితేజ మూవీకి మ్యూజిక్ అందించారు కదా..? అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు..?
నా పాటలు, ఆల్బమ్స్ విని సంపత్ నంది గారు, రవితేజ గారు బెంగాల్ టైగర్ కి మ్యూజిక్ అందించే అవకాశం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. రవితేజ గారు ఓ మాట అన్నారు. అది బలంగా గుర్తుండి పోయింది. అదేమిటంటే..భీమ్స్ మనం మాటలడకూడదు..మన పని మాట్లాడాలి అని. జీవితాంతం ఆ మాటలు గుర్తుంటాయి.
గీత రచయితగా కెరీర్ ప్రారంభించి..సంగీత దర్శకుడిగా మారడానికి కారణం ఏమిటి..? గీత రచయితగా మీ ఫస్ట్ సాంగ్ ఏమిటి..?
గీత రచయితగా కెరీర్ ప్రారంభించి ఆయుథం సినిమాలో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే సాంగ్ రాసాను. తక్కవు సినిమాలకే పాటలు రాసాను. నేను సొంతంగా ట్యూన్స్ క్రియేట్ చేస్తుంటాను. అందుచే నా ఫ్రెండ్స్ నువ్వే ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకూడదు అనడంతో..అవును కదా నేనే ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకూడదు అనుకుని ఆలోచనలో పడి చివరకి గీత రచయిత నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారాను.
మీ పాటల్లో ఫోక్ ప్లేవర్ ఎక్కువుగా కనిపిస్తుంటుంది. కారణం ఏమిటి..?
చిన్నప్పటి నుంచి స్కూల్ లో పాటల పోటీల్లో పాల్గొనేవాడిని. మా ఊరు పల్లెటూరు కావడం వలన నాపై ఫోక్ ప్రభావం ఉంది. జానపదం తోనే పుట్టాను పెరిగాను కాబట్టి నా పాటల్లో ఆ ప్లేవర్ ఉంటుంది. అయితే అందర్నీఅలరించడానికి అన్ని రకాల పాటలు చేయాలనుకుంటున్నాను.
మీ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్..?
నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే హారీష్ జైరాజ్. ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం.ఆయన పాటలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనంటే ఇష్టం కంటే ఎక్కువ.
బెంగాల్ టైగర్ మూవీ చూసారా..? సినిమా ఎలా ఉంటుంది..?
బెంగాల్ టైగర్ మూవీ చూసాను. ఈ మూవీలో నాకు నచ్చింది అంటే స్ర్కీన్ ప్లే. చాలా చాలా కొత్తగా అనిపించింది. ప్రెష్ గా అనిపించింది.
సినిమా చూస్తున్నంత సేపు భలే ఉంది అనిపించింది. ఈ సినిమాకి నేను మ్యూజిక్ అందించానని చెప్పడం లేదు. కామన్ ఆడియన్ గా చెబుతున్నాను బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు 101% హిట్.అందర్నీ బెంగాల్ టైగర్ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com