బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు.
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు. ఆడియోకు మంచి స్పందన లభించడంతో ప్లాటినం డిస్క్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.
అయితే బెంగాల్ టైగర్ మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్పందిస్తూ...రవితేజ మూవీకి మ్యూజిక్ అందించడం ఆనందంగా ఉంది. ఇటీవల బెంగాల్ టైగర్ మూవీ చూసాను. ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లతో...సరికొత్త స్ర్కీన్ ప్లేతో మూవీ చాలా బాగుంది. ఖచ్చితంగా బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు 101% హిట్ అని అంటున్నారు. మరి..మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ చెప్పింది నిజమో...కాదో తెలియాలంటే 10 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com