దీపావళికి వస్తున్న 'బెంగాల్ టైగర్'

  • IndiaGlitz, [Monday,October 05 2015]

మాస్ మహరాజ రవితేజ ఎన‌ర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్‌టైగ‌ర్‌. సంపత్ నంది ద‌ర్శ‌కుడు. అందాల ముద్దుగుమ్మలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని అందించిన అభిరుచివున్న నిర్మాణ‌సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మాత‌. రవితేజ కెరీర్లోనే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించారు.

ప్రస్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భీమ్స్ అందించిన ఆడియో ని అక్టోబర్ 18న గ్రాండ్ గా మాస్‌మ‌హారాజ్ అభిమానుల సమ‌క్షంలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా నవంబర్ 5న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.. బెంగాల్ టైగర్ చిత్ర షూటింగ్ ని పూర్తిచేసాము. ముందుగా అన్నికార్క‌క్ర‌మాలు పూర్తిచేసి దసరా కానుకగా బెంగాల్ టైగర్ చిత్రాన్ని విడుదల చేయాలని భావించాం. కానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ బ్రూస్ లీ చిత్రం అక్టోబ‌ర్ 16న, అక్కినేని వారసుడు అఖిల్ నటించిన చిత్రం అక్టోబ‌ర్ 22న విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా, మా చిత్రం బెంగాల్ టైగర్ ని దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో రవితేజ న‌ట‌న అందిరిని ఆక‌ట్టుకుంటుంది. బ్ర‌హ్మ‌నందం గారి కామెడికి చూసిన ప్ర‌తిప్రేక్ష‌కుడు న‌వ్వుకుంటారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా భీమ్స్ పాటలందించారు. అక్టోబర్ 18న బెంగాల్ టైగల్ పాటల్ని సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం. అని అన్నారు.

More News

'రుద్రమదేవి' వెనకుడుగు...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

ఈసారి రకుల్ వంతు

నటనకు సంబంధించిన నవరసాల్లో హాస్య రసాన్ని పండించడం కష్టమంటారు సినీ పెద్దలు.

రామ్ కి ఎంతో స్పెషల్...

కథానాయకుడుడిగా రామ్ ఎంట్రీ ఇచ్చి రానున్న సంక్రాంతితో పదేళ్లు పూర్తి కానుంది.అయితే ఈ తొమ్మిదేళ్లలో ఏ సంవత్సరం జరగని విషయం ఈ సంవత్సరంలో చోటు చేసుకోనుంది రామ్ విషయంలో.

నాగ్ సినిమాకీ అన్నిశుభ శకునములే

'మనం'వంటి మెమరబుల్ మూవీ తరువాత నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'.ఈ సినిమా కోసం నాగ్ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు.

అందుకనే 'రుద్రమదేవి' చరిత్రను వక్రీకరించకుండా చిత్రీకరించాను - గుణ శేఖర్

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి.ఈ సినిమాలో రానా,అల్లు అర్జున్,క్రిష్ణంరాజు,నిత్యామీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.